| కైక కోరికపై వనవాసం చేయటానికి వెళ్తున్న శ్రీరామునకై యంతఃపురస్త్రీలు దుఃఖించుట |
| కం. మ్రొక్కుచుఁ దల్లికిఁ దండ్రికి,నక్కరణిని రామచంద్రుఁ డరిగిన నాపై నొక్కమొగి నంతిపురమున, మిక్కుటమై యార్తరవము మింటికి నెగసెన్. ప్రస్తుతము శ్రీరామప్రజల వృత్తాంతము చెప్పుటచాలించి యీలోపల నంతఃపురమున జరిగిన వృత్తాంతమును గవి చెప్పుచున్నాడు.ముందు చెప్పిన విధముగా శ్రీరాముఁ డందఱు తల్లులకుఁ దండ్రికి నమస్కరించి రథమెక్కి పయనమై పోఁగా నంతఃపురమున మిక్కిలి యధికమైన యేడుపుధ్వని యాకాసమున కెగసెను. కం. గతి యెవ్వఁ డనాథులకున్, గతి యెవ్వఁడు దుర్బలులకుఁ గడుఁ దపసులకున్ గతి యెవఁడు శరణ మెవఁడా, పతి గతిచెడి యెచటి కేగువాఁడో యకటా.పోతనగారి బాణీ స్పష్టంగానే కనిపిస్తున్నది. దిక్కులేనివారికిని బలములేనివారికిని నెవఁడు పొందఁదగివనవాఁడో తపస్సు చేసికొనువారికిఁ బ్రాపింపఁ దగినవాఁడు రక్షకుఁడు నెవఁడో యట్లందఱకు రక్షకుఁడు ప్రాప్యుఁడైనవాఁడు ప్రాపురక్షకుఁడు లేక యయ్యో యెక్కడఁ బోవుచున్నాఁడో. సీ. తనమీఁద నెవరైనఁ దంట లాడిన నైనఁ , గోపంబు చెందఁడే కొమ్మలార ! యేమి చేసిన నది యెవరి నొప్పించునో, యని జంకుచుండునే యమ్మలార ! యెవ్వరేనియుఁ గింక నొ వ్వొంద వారల, నూఱట లాడునే యువిదలార ! పరసుఖదుఃఖముల్ స్వసుఖదుఃఖము లట్లు , పరికించు చుండునే తరుణులార ! తే. కన్న తల్లిని గౌసల్యఁ గన్న పగిది మనల నందఱఁ జూచునే మగువలార ! యట్టి పుణ్యాత్ముఁ డటువంటి యనఘు చరితుఁ డెచట నున్నాఁడొ కటకటా యెందు జనునొ. 1124 తనమీద నెవరైనను గొండెములు చెప్పినను గోపింపఁడు. తానుజేయు కార్య మెవరి మనమునకైన నొప్పి కలిగించునో యనిసందేహించి యట్లెవరి మనసు నొవ్వని కార్యములే చేయుచుండును. తనమీఁద నెవరైన గోపించి నొప్పి చెందినను వారలను సమాధానపఱుచును. ఇతరుల సుఖము తనసుఖముగను ఇతరుల దుఃఖము తన దుఃఖముగను జూచుచుండును. కన్నతల్లిని గౌసల్య నేవిధముగఁ జూచునో యట్టులే మనలనందఱఁ జూచును. అటువంటి పుణ్యాత్ముఁడు అటువంటి నిర్దుష్ట చరిత్రుఁడు ఎందున్నాఁడో - యెందు బోవుఁచున్నాఁడో , ఈలాంటి ఎన్నో అందమైన పద్యాలతోనూ, అర్థ తాత్పర్య వాఖ్యానాలతోనూ సాగిపోతుంటుంది వాసుదాసు ( వావిలికొలను సుబ్బారావు ) గారి సుందరమైన మందర వ్యాఖ్యానము. అందఱూ తప్పక చదవాల్సిన మంచి పుస్తకం. |
Apr 9, 2010
శ్రీరాముని సద్గుణాలు ( మందరం నుంచి )
Mar 18, 2010
కరుణశ్రీ గారి మందార మకరందాలు - చుక్కగుర్తు పద్యాలు
Mar 15, 2010
నూతన సంవత్సర శుభాకాంక్షలు
| బ్లాగ్మిత్రులందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకూ వికృతి నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మల్లిన నరసింహారావు |
Mar 9, 2010
కుచేలోపాఖ్యానము
కుచేలోపాఖ్యానము
మొన్నను ఆదివారం కావటం మూలాన మా నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేదని తెలిసి చూచి వద్దామని పెద్దాపురం నుంచి మా స్వగ్రామం ఉండ్రాజవరం ప్రయాణం కట్టాను. నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం నాలుగైంది. అప్పటికి మా నాన్నగారు మా ఊళ్ళోని వృద్ధాశ్రమానికి కాలక్షేపం కోసం వెళ్ళారని తెలిసి అక్కడికే వెళ్ళాను. మా మాష్టారు శ్రీ కుదప సత్యనారాయణగారి నిర్వహణలో నడుస్తుంది ఆ వృద్ధాశ్రమం. ఆ ఆశ్రమానికి కావల్సిన ఆర్ధిక వనరుల సేకరణలో మా నాన్నగారు కూడా భాగస్వామ్యం వహిస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తరువాత తిరిగి పెద్దాపురం బయలుదేరుదామనుకుంటుంటే - మా ఊర్లో సాయంకాలం 6.30 నుండి 8.30 గంటలవరకూ మంచి పురాణ కాలక్షేపం జరుగుతుందనీ అది చూచి వెళితే బాగుంటుంది కదా అని మా మాష్టారు అన్నారు. అందుకని ఉండిపోయి ఆ కార్యక్రమం చూద్దామని అక్కడకు వెళ్ళాను. ఆరోజు కార్యక్రమం == కుచేలోపాఖ్యానం. ప్రవచించినవారు శ్రీ శ్రీమన్నారాయణ గారు. వారిది మంచి కంఠస్వరం. పోతన భాగవతం నుంచి కుచేలోపాఖ్యానం గానం చేసారు. అందరూ చాలా బాగా ఆనందించారా కార్యక్రమాన్ని. మన బ్లాగ్మిత్రులకోసం ఆ పద్యాలను బ్లాగులో అందిస్తే బాగుంటుందని అనిపించి ఈ బ్లాగు పోస్టింగు మొదలుపెట్టాను.
కుచేలుని భార్య - అతనికుటుంబం దుర్భర దారిద్ద్ర్యంతో బాధపడుతూ వారి 32 మంది సంతానానికి ఆహారాన్నికూడా అందివ్వలేని తరుణంలో భర్తతో ఇలా అంటుంది.
తే.
అంతే కాదు , ఆయన
చ.
అనూన సంపదల్ - కాదు అనూహ్య సంపదల్ - అని చదువుకోవాలని ఒకరు అన్నారట.
మ.
ఆర్తిహరులైనవారు మనస్సులో తలచినంత మాత్రాన్నే ఆర్తి హరుడగుట వలన వారికి తననే ఇచ్చేసుకుంటాడు, అందుచేత భక్తితో ప్రార్ధించేవారికి సకల సంపదలనూ తప్పక ఇస్తాడు వెళ్ళిరండి అని పంపిస్తుంది అతని భార్య కుచేలుడిని శ్రీకృష్ణుని దగ్గఱకు.
కుచేలుడు శ్రీకృష్ణ దర్శనం ఇహపరసాధనం అని మనస్సులో అనుకొని,
తే.
ఆయన నువ్వన్నట్లుగా సాక్షాత్ భగవంతుడు. భగవంతుని దర్శనానికి ఉత్తచేతులతో వెళ్ళకూడదు కదా ? మరి నేనేం కానుక పట్టుకెళ్ళనూ అంటాడు కుచేలుడు.
తే.
పాపం కొన్ని అటుకులను అతని శిథిల వస్త్రంలో మూటకట్టి ఇచ్చిందటా యిల్లాలు. అవి తీసుకుని శ్రీకృష్ణుని చూడటానికి బయలుదేరి వెళ్ళాడు కుచేలుడు.
వ. అట్లు చనుచుం దన మనంబున.
సీ.
పరిదానము అంటే బహుమతి లేక లంచము, అంటే ఆ రోజుల్లోకూడా లంచాలు గట్రా ఉన్నాయన్నమాట.
వ. అట్లు ప్రవేశించి, రాజమార్గంబునం చని, కక్ష్యాంతరంబు గడచి, చని ముందట.
సీ.
మన్మథమన్మథుండు అట ఎంతమంచి విశేషణమో చూడండి. రుక్మిణీ దేవి అంతఃపురం వరకూ సరాసరి రాగలిగాడన్నమాట . ఎంత కృపావిశేషమో.
సీ.
మ.
తే.
ఉ.
చ.
వ. అయ్యవసరంబున
క.
తే.
తివిరి యజ్ఞాన తిమిర ప్రదీప మగుచు
నవ్యం బైన బ్రహ్మంబు ననుభవించు
భరిత సత్త్వుండు సత్కర్మ నిరతుఁ డతుల
భూసురశ్రేష్ఠుఁ డనఘుండు బుధనుతుండు.
వ. అ మ్మహాత్మునివలన సకల వర్ణాశ్రమంబుల వారికి నేను విజ్ఞానప్రదుండ నగు గురుండనై యుండియు, గురుభజనంబు పరమ ధర్మం బని యాచరించితి. అది గావున,
క.
వ.
అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని, సమస్త భావాభిజ్ఞుం డైన పుండరీకాక్షుండు మందస్మిత వదనారవిందుండగుచు, నతని జూచి, నీ విచ్చటికి వచ్చినపుడు నాయందుల భక్తిం జేసి, నాకు నుపాయనంబుగా నేమి పదార్థంబు దెచ్చితివి , అ ప్పదార్థంబు లేశమాత్రం బైనఁ బదివేలుగా నంగీకరింతు, అట్లుంగాక, నీచవర్తనుండై, మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచల తుల్యంబైన పదార్థంబు నొసంగిన, నదియును నా మనంబునకు సమ్మతంబు గాదు. కావున,
క.
చూడండి. గీతలోనూ భగవానుడీ విషయాన్నే సుమారుగా ఇవే మాటలలో చెప్తాడు.
అ.
క.
అ వ్విప్రుండు చనుదెంచిన కార్యంబు దన దివ్యచిత్తంబున నెఱింగి, యితఁడు పూర్వభవంబున నై శ్వర్యకాముం డై, నన్ను సేవింపఁడు. ఐనను, ని క్కుచేలుండు నిజకాంతా ముఖోల్లాసంబు కొఱకు నాయొద్దకుం జనుదెంచినవాఁడు. ఇతనికి నింద్రాదులకుం బడయరాని బహు ప్రకారంబు లైన సంపద్విశేషంబు లీక్షణంబ యొడఁగూర్పవలయు, అని తలంచి, యతండు జీర్ణవస్త్రంబు కొన ముడిచి తెచ్చిన య య్యటుకులముడియఁ గని , యిది యేమి యని యొయ్యన న మ్ముడియఁ దన కరకమలంబున విడిచి, య య్యటుకులు గొన్ని పుచ్చికొని, యివియ సకలలోకంబులను నన్నుఁ బరితృప్తిం బొందింపజాలు, అని యప్పుడు,
క.
Feb 21, 2010
మాతృభాషా దినోత్సవం - చుక్కగుర్తు పద్యాలు
మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.--
చుక్క గుర్తు పద్యాలు
ఈరోజు మాతృభాషా దినోత్సవం. అందుకని చిన్నప్పుడు స్కూల్లో కంఠస్థం చేసిన చుక్కగుర్తు పద్యాలను ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకుంటున్నాను.
దుష్యంతుడు- శకుంతల ( శ్రీమదాంధ్ర మహా భారతము ) -నన్నయ
చ.
క.
మధ్యాక్కర.
చ.
గజేంద్ర మోక్షం - శ్రీమదాంధ్ర భాగవతము - బమ్మెర పోతన
ఉ.
శా.
మ.
క.
క.
మ.
శా.
ప్రహ్లాద చరిత్ర -పోతన
క.
ఇంకా చాలా చాలా గుర్తుకొస్తున్నాయి. అన్నీ రాయాలంటే చాలా కష్టం . చివరగా మాతృ భాషా దినోత్సవ సందర్భంగా నేను వ్రాసిన కవితతో దీన్ని ముగిద్దామనుకుంటున్నాను, చర్విత చర్వణమైనా గాని. అదిక్కడ చదవండి.
తెలుగు లోనె బ్లాగండోయ్
తెలుగులోనె రాయండోయ్
తెలుగులోనె చదవండోయ్
తెలుగు మాట వినరండోయ్.
తెలుగే మన మాతృభాష
తెలుగే మన ఆంధ్రభాష.
తెలుగే మన జీవ శ్వాస
తెలుగే మన చేతి వ్రాత.
తెలుగే మన కంటి వెలుగు.
తెలుగే మన ఇంటి జోతి.
తెలుగే మన మూలధనం
తెలుగే మన ఆభరణం.
తెలుగును ప్రేమించుదాం
తెలుగును వినిపించుదాం
తెలుగును వ్యాపించుదాం.
తెలుగును రక్షించుదాం.
తెలుగుకు లేదోయ్ శాపం
తెలుంగు పలుకే మనదోయ్.
తెలుగన్నా, తెలుఁగన్నా,
తెనుగన్నా, తెనుఁగన్నా,
తెలియరొ అది తేనె వూట
తెలుపరొ ప్రతి పూట పూట.
తెలుగంటే నన్నయ్యా
తెలుగంటే తిక్కన్నే
తెలుగంటే పోతన్నా
తెలుగంటే శ్రీనాథుడు.
తెలుగంటే అల్లసాని
తెలుగంటే తెన్నాలే
తెలుగంటే సూరన్నే
తెలుగంటే రాయలెగా.
తెలుగంటే అన్నమయ్యా
తెలుగంటే త్యాగయ్యే
తెలుగంటే క్షేత్రయ్యా
తెలుగంటే రామదాసు.
తెలుగంటే ఎంకిపాట
తెలుగంటే జానపదం
తెలుగంటే బాపిరాజు
తెలుగంటే బ్రౌనుదొరా.
తెలుగంటే జంటకవులు
తెలుగంటే శ్రీశ్రీ శ్రీపాదే
తెలుగంటే పానుగంటి
తెలుగంటే విశ్వనాథ.
తెలుగంటే కందుకూరి
తెలుగంటే గురజాడ
తెలుగంటే గిడుగేరా
తెలుగంటే సీనారే.
తెలుగే పాపయ్యశాస్త్రి
తెలుగే గుఱ్ఱం జాషువ
తెలుగే వెంకటచలమూ
తెలుగేరా రావిశాస్త్రి
తెలుగే కాళీపట్నం.
తెలుగంటే మొక్కపాటి
తెలుగంటే ఆరుద్రా
తెలుగంటే ముళ్ళపూడి
తెలుగురమణ బాపుబొమ్మ.
తెలుగు మాట లొలుకు తేనె
తెలుగు సినిమ విశ్వనాథ
తెలుగు పాట కృష్ణశాస్త్రి
తెలుగు నోట ఘంటసాల.
తెలుగే శృంగార పదం
తెలుగే బంగారు రథం
తెలుగే శ్రీకృష్ణు మురళి
తెలుగే మన బాలమురళి.
అందుకే
తెలుగు లోనె బ్లాగండోయ్
తెలుగులోనె రాయండోయ్
తెలుగులోనె చదవండోయ్
Feb 13, 2010
జననియు జనకుఁడు వధువులుఁ దనయులుఁ దనయయును గృహిణి దానును నతిథియున్
| రామాయణ రస గుళికలు ( శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము - వావిలికొలనుసుబ్బారావు గారు ) అయోధ్యాపుర జన వర్ణనము ఉ. అందఱు హృష్టమానసులె యందలియందఱు ధర్మ వేదు లే యందఱు శాస్త్రచింతనపరాయణులే మఱి స్వస్వతుష్టులే యందఱుఁ ద్యాగశీలు రట నందఱు సత్యవచోభిభాషణా మందులు భూరిసంచయు లమాస గవాశ్వ ధనాఢ్యు లందఱున్. ౨౬౫ అయోధ్యానగర వాసులందఱు నిష్టార్థములన్నియుఁ బ్రాప్తించుటచే సంతుష్టిగల మనస్సు గలవారే, అందఱు ధర్మము నెఱిగినవారే, అందఱు శాస్త్ర విషయమైన యాలోచనలు చేయుటయందు సమర్థులే, అందఱు తమకు భగవంతుఁ డిచ్చిన దానితోఁ దృప్తిపడి యుండువారే, అందఱు త్యాగము స్వభావముగా గలవారే, అందఱు నిజము చెప్పువారే, అందఱు కావలసినంత సంపాదించి యుంచుకొన్నవారే, అందఱు కొఱఁత లేక వారివారికిఁ గావలసినన్ని గోవులు - గుఱ్ఱములు - ధనములు కలవేరే. కందము. జననియు జనకుఁడు వధువులుఁ దనయులుఁ దనయయును గృహిణి దానును నతిథియున్ దనివిగ నిండక యుండెడి మనికి యొకండైనలేదు మందునకైనన్. ౨౫౭ ' మాతాపితాస్ను షే పుత్రౌ పుత్రీ పత్న్యతిథి స్స్వయం దశసంఖ్య కుటుంబీతి విష్ణునో క్తం ద్విజోత్తమ ' యని కుటుంబ లక్షణము. తల్లి తండ్రి తాను దనభార్య, ఇద్దఱు కొడుకులు, ఇద్దఱు కోడండ్రు, ఒక కూతురు, ఒక యతిథి - యీ పదుగురుండినఁ గుటుంబ మనబడును. ఇంతకుఁ దక్కువగల యి ల్లా నగరమున లేదు.( ఇప్పటి కుటుంబాలు ముగ్గుఱు గాని నలుగుఱు గాని అంతే ) ఆటవెలది. తన్ను ధర్మవిధులఁ దనయులఁ దనయలఁ తల్లిఁ దండ్రిఁ దనదు దార నన్న దమ్ములను గదర్యతావశచిత్తుఁడై యేఁచువాఁడు లేఁడ యెచట నేని. ౨౫౮ ఈ పద్యమునఁ జెప్పఁబడిన వారిని కూడు నీళ్ళు పెట్టక కాని యితర విధములఁ గాని బాధించువాఁడు కదర్యుఁడు, వానిభావము కదర్యత, అత్యంతలోభియై యని భావము. ' ఆత్మానం ధర్మకృత్యంచ, పుత్రందారాంశ్చ పీడయేత్, లోభాద్యః పితరం బ్రాతృన్ స కదర్య ఇతి స్మృతః ' అని కదర్య లక్షణము. తాను దినక ధర్మము చేయక కొడుకులను భార్యను నెవఁడు కడుపునిండఁ గూడు పెట్టక బాధించునో యట్టి పరమ లోభి కదర్యుఁ డనబడును. అట్టివాఁ డొక్కఁ డైన నా పట్టనమందు లేఁడు. కందము. పోఁడిమి గల తత్పురమున లేఁడు ఖలుఁడు దుష్టకామి లేఁడు చదువులన్ వాఁడిమి మీఱనిపురుషుఁడు లేఁ డట నాస్తికుఁడు నెందు లేఁడు వెదకినన్. ౨౫౯ పూర్వ మన్ని జాతులవారును విద్యనేర్చినవారే యని చెప్పుచున్నాఁడు. పూర్వము శూద్రులకు విద్య నిషేధింపఁ బడినదను దుర్వాదము దీనిచే ఖండితము. శూద్రులకు వేదము నిషేధింపఁ బడినది కాని కులవృత్తికిఁ గావలసిన విద్య లోనైనవి నిషేధింపబడలేదు. అందమైన యానగరమందు దుష్టుఁడు లేఁడు, పరస్త్రీల నాశించువాఁడు, తన భార్యతోనైనను నిషిద్ధదినంబుల నిషిద్ధసమయంబు లందుఁగాని క్రీడించువాఁడును, వేశ్యాలంపటుఁడును లేఁడు. చక్కగఁ జదువరానివాఁడును లేఁడు. దేవుఁడు, పరలోకము లేదనువాఁడు లేఁడు. ఉ. అందఱు ధర్మశీలరతులందఱు నిశ్చలసంయతాత్ము లే యందఱు సత్స్వభావయుతులందఱు నిర్మలవృత్తశాలు రే యందఱు సన్మహర్షినిభు లందఱు నిర్మలమానసాఢ్యు ల య్యందఱు దారహారయుతు లందఱుఁ గుండలమండితశ్రవుల్. ౨౬౦ ఆ పురమం దందఱు ధర్మముతోఁ గూడిన శీలమందుఁ బ్రేమగలవారే, అందఱు నింద్రియనిగ్రహముగలవారే, అందఱు మంచి స్వభావముగలవారే, అందఱు దోషరహితమైన నడవడిగలవారే. అందఱు ఋషులతో సమానులే. అందఱు కలంకము లేని మనస్సుకలవారే, అందఱు ముత్యాలసరములు లోనైన యాభరణముల ధరించినవారే, అందఱు కుండలములచే నలంకరింపఁబడిన వీనులు గలవారే. ఉ. అందఱు సుందరుల్ మకుటు లందఱుఁ జందనలి ప్తదేహు లం దందఱుఁ బూర్ణభోగయుతు లందఱు సంతతమృష్టభో క్త ల య్యందఱు దానశీలరతు లందఱు భూషణభూషితాంగు ల య్యందఱు నిష్కవంతు లట నందఱు నంగదదీప్త బాహువుల్. ౨౬౧ అందఱు చక్కదనము కలవారే, కురూపులు లేరు అందఱు మకుటములు ధరించినవారే, అందఱు చందనము పూసికొనియుండువారే, అందఱు కొఱఁత లేక భోగము లనుభవించువారే, అదఱు నిష్టమై పరిశుద్ధమైన యాహారము తీసుకొనువారే, అందఱు నన్నదాతలే, అందఱు నన్ని యవయవములయందు నలంకారములు ధరించినవారే, అందఱు నురోభూషణములు గలవారే, అందఱు బాహుపురులు గలవారే. ఉ. అందఱు నిర్జితేంద్రియులు నందఱు యజ్వలు నాహితాగ్ను ల య్యంద ఱటన్ స్వకర్మరతు లందఱు నిత్యము బ్రహ్మచింతనుల్ అందఱు సంతతాధ్యయనులందఱు సంయమితుల్యు లప్పురిం జెందిన యట్టిలోకులు సుశీలరతుల్ కరుణాపరాయణుల్. ౨౬౨ ఆ పురమునందలి యందఱు నింద్రియముల జయించినవారే. అందఱు సోమయాగము చేసినవారే. అందఱు నగ్నిహోత్రములు కలవారే, అందఱు వారివారి వర్ణాశ్రమధర్మముల ననుసరించి కర్మములు చేయువారే, అందఱు ప్రతిదినము బ్రహ్మమును ధ్యానించువారే, అందఱు జపతపస్సంపన్నులే, అందఱు ఋషుల చర్యలు గలవారే్, అందఱు దయాళులే, అందఱు చక్కని నడవడి గలవారే. ఈ పద్యమునందలి పాదాంత సంధివిషయమును గుఱించి వాసుదాసుగారు చాలా విస్తృతమైన వివరణ యిచ్చారు. వారు ప్రతి పద్యానికి ప్రతిపదార్థాన్ని కూడా వ్రాసారు. |
Jan 30, 2010
ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టెడి వేళఁ , జూపఱుల్
Jan 28, 2010
మృత్యుంజయా పాహి మృత్యుంజయా పాహి I
ఈ మృత్యుంజయ స్తోత్రము లో మొదటి పాదం 12 అక్షరాలతోనూ రెండవ పాదం 10 అక్షరాలతోనూ ఉన్నది. రాగయుక్తంగా పాడుకోవటానికి చాలా అనువుగా ఉంది. ఈ శ్లోకం ఏ చందస్సులో ఉన్నదో పెద్దలెవరయినా తెలియజేస్తే కృతజ్ఞుడనై ఉంటాను.
Jan 14, 2010
వినరయ్య నరసింహవిజయము జనులాల
నాట
Jan 13, 2010
సంక్రాంతి శుభాకాంక్షలు
బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.











