వర్ణన రత్నాకరము - ధర్మములు - ఆంధ్రమహాభారతము -నన్నయ
క.
తగు నిది తగ దని యెదలో, వగవక సాధులకుఁ బేదవారల కెగ్గుల్
మొగిఁ జేయు దుర్వినీతుల, కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్. ఆది.ప్రధమ.85
మహా
భారతం ప్రారంభంలో సమర అనే దేవశుని(దేవతా సంబంధమైన కుక్క) కొడుకు సారమేయుడు
అనే కుక్క కుమారుని జనమేజయుని తమ్ములు శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు
అనబడే ముగ్గురు కొట్టినప్పుడు ఆ కుక్క కుమారుడు సరమతో పిర్యాదు చేయగా ఆ
సరమ జనమేజయుని వద్దకు వచ్చి అన్న మాటలు అవి.
0 comments:
Post a Comment