వర్ణన రత్నాకరము - విజయ విలాసము - చేమకూర వేంకటకవి - విటులు
సీ.
అతి వినోదము గాఁగ రతుల మెప్పించు నీ, పచ్చల కడియాల పద్మగంధి
చక్కెర మో విచ్చి చవులఁ దేలించు నీ, ముత్యాల కమ్మల ముద్దులాఁడి
తృణముగా లోఁ జేయు నెంతటి వాని నీ, నీలాల ముంగఱ నీలవేణి
వెల లేని పొందిక విడివడ మెఱయు నీ, కెంపులఁ బొగడల కీరవాణి
గీ.
యనుచుఁ దమలోన నెఱజాణ తనము మీఱ, వారకాంతామణుల మేలు వార్త లెల్లఁ
దెలుపుచును వెన్నెల బయిళ్ళఁ గలసి నగుచు, విటులు విహరింతుర ప్పురీ వీథు లందు.
విజయ విలాసము - చేమకూర వేంకటకవి - అ 1, పద్య 81.
0 comments:
Post a Comment