తాళ్ళపాక పద సాహిత్యము, నాకు నచ్చిన పద్యకవిత, తదితర సాహిత్య ప్రక్రియలు. ( దీని కనుబంధంగా ఆంధ్ర నిఘంటువు కు లింకు ఇవ్వబడినది. అందరూ ఉపయోగించుకొందురు గాక ! )
మరచిపోలేని మంచిరోజు
ఈ రోజు మే నెల 17వ తారీఖు. నేనూ నా భార్యా అమెరికా వచ్చి అప్పుడే 11 రోజులయింది. మా అబ్బాయి చి.కృష్ణకిషోర్ ఈ రోజున అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుండి తన Executive M.B.A. Degree ని అందుకొనే Commencement రోజు( మన దేశంలో Convocation అని అంటారు దీన్ని). ఇందుకోసమనే మేమిద్దఱం ఇండియా నుండి బయలుదేరి అమెరికాలో వాడు నివసిస్తున్న Los Angels కు దగ్గఱగానున్న కరోనా కు ఈనెల 6వ తారీఖున వచ్చాము.
మా అబ్బాయి అమెరికా వచ్చి దాదాపు 14 సంవత్సరాల పైగా కాలం గడచినప్పటికీ మేం వాడిని చూడటానికి అమెరికా రావటం పడలేదు. చివరికి ఈ Commencement కి రావటానికై అప్లై చేస్తే వీసా వచ్చింది. అంతకు పూర్వం ఓసారి వీసా కోసం ప్రయత్నిస్తే అది సఫలం కాలేదు.
మా అబ్బాయి ఇండియాలో చదువుకున్నది B.B.M. వాడిని నేను వాడు చదువుకునే రోజుల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులవల్ల ఇంజనీరింగ్ చదివించలేక పోయాను. వాడు Peoples Soft పూర్తిచేసి అమెరికాకు ఉద్యోగం నిమిత్తం 1998లో వచ్చాడు. ఇంజనీరింగ్ చదవలేకపోయాననే బాధ వాడిని అధికంగా పీడిస్తూ ఉండేది. తరవాత్తఱవాత వాడు కొంచెం అమెరికాలో సెటిల్ అయ్యాక తన జాబ్ తాను చేసుకుంటూనే Executive M.B.A. Course ను తన స్వంత సంపాదనతో పూర్తి చేసాడు. ఇది మాకు చాలా ఆనందం కలిగించిన విషయం. పిల్లలు ప్రయోజకులైతే పెద్దవాళ్ళకి సహజంగా కలిగే ఆనందాన్ని ఈరోజు మేమిద్దఱం అనుభవించాం. కానీ ఓప్రక్క వాడిని చదువుకునే రోజుల్లో వాడి కోరిక మేరకు చదివించలేకపోయామనే బాధ మమ్మల్ని పీడిస్తూనే ఉన్నది. ఈరోజు మేం అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని నా బ్లాగు మిత్రులందరితో పంచుకోవాలనిపించి ఈ పోస్టును వ్రాయటం జరిగింది.
Posted by
Unknown
3
comments:
Anonymous
said...
చాలా సంతోషమండీ. చదివిన చదువుకి, సంబంధం లేకుండా ఉన్నతమైన స్థితిలో స్థిరపడ్డ వాళ్ళు ఎందరో. మీరు గడిచినదాన్ని ఆలోచించకుండా మీ అబ్బాయి అభివృధికి ఆనందించండి.
3 comments:
చాలా సంతోషమండీ. చదివిన చదువుకి, సంబంధం లేకుండా ఉన్నతమైన స్థితిలో స్థిరపడ్డ వాళ్ళు ఎందరో. మీరు గడిచినదాన్ని ఆలోచించకుండా మీ అబ్బాయి అభివృధికి ఆనందించండి.
బాగుందండీ. అనూగారి మాటే నా మాటానూ. కష్టపడి పైకొచ్చిన మీ అబ్బాయికి అభినందనలు.
పట్టుదలతో సాధించిన మీ అబ్బాయి కి అభినందనలు!
Post a Comment