శృంగార నాట్య శిల్పము
శ్రీరాగం
తరితీపను చెఱకున నిత్తఱిఁ బండు వండె నిదివో 11పల్లవి11
బగివాయఁగ రాదిక దంపతులకు నెక్కడ జూచిన
చిగురుకుఁ జేఁగలు వచ్చెను చిత్తజు రాజ్యమున
తగిలి తగిలి కోవిల కూతలు మొగసాలల కెక్కెను
జగమున విరసపుఁ బవనుఁడు చల్లని వాఁడాయ 11విరహము11
పొసఁగంగ నెవ్వరికైనను పొందులె జరపఁగ వలసెను
పసిమొగ్గలు వాడెక్కెను వసంతకాలమున
ముసగస లాడెడు తుమ్మిదల మోతల చలములు చెల్లెను
సుసరము ననె పగరాజును చుట్టము వాఁడాయ 11విరహము11
కలయికలే కలకాలము కాణాచులుగాఁ బరగెను
ఇలలో శ్రీ వేంకటపతి యిచ్చిన సంపదను
యెలమిని పదారువేలకు ఇతఁడే మగడై నిలిచెను
కలగొని మనసనియెడి చెలికాడును దోడాయ. 11విరహము11
(తాళ్ళపాక పదసాహిత్యము శృంగార సంకీర్తనలు -28 సంపుటం)
28-27
వలవదు = వద్దు
తరితీపు =a fool's paradise, lust, ఉద్ధృతి
నిత్తఱిఁ = this time, this opportunity
వండె= పండె
బగివాయఁగ= ఎడబాటు
చేఁగలు=చేవ, బలము
చిత్తజు = మన్మథుని
మొగసాలలు= నగరి తలవాకిట చావడి.
పొసఁగంగ=to bring to terms, to persuade
ముసగసలు=రహస్యసంభాషణములు(ఈ అర్థం నిఘంటువులలోనిది కాదు, నాకు తోచినది)
చలములు=మాత్సర్యములు
సుసరమునను= వెంటనే
పగరాజు=చంద్రుడు
పగరాజు=చంద్రుడు
కాణాచులు = చిరకాలవాస స్థానములు, A hereditary right to enjoy a certain office or a piece of land.
పరగు=ప్రయుక్తమగు, ప్రసరించు, విహరించు
ఎలమిని = pleasantly, సంతోషము, వికాసము, తృప్తి
కలగొని=కలుగు, వ్యాపించు
ఇది అన్నమయ్య రసికుల కిచ్చిన సార్వకాలిక సందేశం ! రసికజీవన
నాట్యశిల్పానికిది మూల సూత్రం !! శృంగార సంకీర్తనల రసాస్వాదనానికిది
మహాద్వారం !!! ఆ ద్వారంవద్ద, చూత కిసలయాలు తోరణాలుగా కట్టిన ఆమహాద్వారం వద్ద అన్నమయ్యయే స్వయంగా నిలబడి రసికులకు స్వాగతం పలుకుతున్నాడు. రసిక హృదయులను తన సంగీత సాహిత్య రస విభావరీ చర్వణానికి సమాహ్వానిస్తున్నాడు.
అయ్యా! ఇది రసికరాజ్యము ! ఇక్కడ యికమీదట 'విరహ' మనే మాటకు తావులేదు.ఎందుకంటే, చెఱకు విలుకాని పంట యిప్పుడు పండినది. దంపతుల కిక్కడ ఎడబాటు లేదు. విరహ మంతకంటే లేదు. సరికదా - ఒకరి ప్రక్క నొకరు, ఒకరివెంట నొకరు ఆసుపోసినట్లుగా తిరగవలసిందే ! ఈ మన్మథుని రాజ్యంలో చిగురుకు చేవ వచ్చింది. 'అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ' అన్నమాట సార్థకమైంది.కోవిల కూతలు యిండ్ల ముంగిళ్ళలోనికి అంటే యౌవన ప్రాంగణంలోని ప్రేయసీ ప్రియుల హృదయాలకు తగిలి తగిలి యింపెక్కాయి. అందాకా వేడిగాలులు వీచిన పవనుడు కాస్తా చల్లని వాడయ్యాడు.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రేయసీ ప్రియుల సమాగమం తప్పదు. ఈ వసంతకాలంలో పసిమొగ్గలు సైతం వాడి యెక్కాయి. అనగా పుష్పబాణుడైన మన్మథుడు తన పంచబాణాలను వాడిగా యెక్కుపెట్టాడు. అవ్యక్త మధురంగా ముసగసలాడే తుమ్మెదల మోతల సాధింపులకు కాలం చెల్లింది. చాల సులభంగానే, ఒకప్పుడు విరహకాలంలో పగబూనిని చంద్రుడు దగ్గరి చుట్టమయ్యాడు.
ప్రేయసీ ప్రియులైన దంపతుల కలయికయే యిప్పుడు కాణాచిగా గుర్తింపబడింది. పదారువేల గోపస్త్రీలకు తా నొక్కడే మగడై శ్రీ వేంకటపతి ఈ భూమిపై నిలచి సంపదతో వెలుగుతున్నాడు. ఇక రసికులకు వారి మనస్సనే చెలికాడు తోడైవున్నాడు. రసికులకు విరహవ్యధ యిక ముమ్మాటికీ లేదని అన్నమయ్య ఘంటాపథంగా చాటి చెప్పిన కీర్త యిది.
(ఇక్కడ వ్రాసిన వాక్యాలు పరిష్కర్త శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారివి కాని ఈ సంపుటానికి పీఠిక వ్రాసిన వారివి కాని కావచ్చును.వారి పేరు గ్రంథంలో ఉదాహరింపబడలేదు. గమనించగలరు.)

4 comments:
గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు పుట్టపర్తి వారికి ఆప్త మిత్రులు వారూ రాళ్ళపల్లి వారూ అన్నమయ్య ప్రాజెక్ట్లు లో పనిచేసేటప్పుడు కొన్ని పదాల అర్థ వివరణలకోసం కడప వచ్చి మా అయ్యగారి వద్ద చర్చించి తగిన సలహాలను తీసుకుని వెళ్ళేవారట..
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, రాళ్ళపల్లి మాత్రమేనా? తరిగొండ వెంగమాంబ అన్నమాచార్యులున్నూ అయ్యగారి వద్ద చర్చించి తగిన సలహాలను తీసుకుని వెళ్ళేవాళ్ళని చెప్పుతారు. అయ్యకు రావాల్సిన జ్ఞానపీఠ అవార్డు డా. సి. నారాయణ రెడ్డికి ఇచ్చేరని మీ బ్లాగులో రాసేరు. అంతకంటేనా.
ఎందుకీ వ్యంగ్యం ఇది మా నాన్న గారి గురించా నా గురించా జ్ఞానపీఠం మా అయ్యకు రాలేదని రాసానా నేనే కాదు ఎందరో రాసారు. రామసుబ్బశర్మ గారికీ మా నాన్నగారికీ మిత్రత్వం అబధ్ధమేమీ కాదే.వారు మా ఇంటికి మా నాన్న ప్రాణ స్నేహితునిలా రావటం అబధ్ధం కాదు. మా నాన్న గారు పోయిన విషయం ఆయన వద్ద దాచారు వారి కుటుంబ సభ్యులు. చివరికి ఆయన జబ్బు పడి వుండగా నా కీ బ్లాగు ప్రారంభించాక ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో అర్థం కావటం లేదు ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా మాట్లాడతారో అనిపిస్తూంది.
Ananymousగారూ నా రాతల్లో పొరపాట్లు ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటాను.నేను ఎవరినీ కించ పరచటానికి రాయటంలేదు ఇది గమనించి స్నేహం చేస్తే సంతోషిస్తాను.
అనూరాధ.

Post a Comment