లలిత
కోరికలు కొనసాగె గోవిందరాజ
మేరమీరి ఇట్లానే మెరసితివా 11పల్లవి11
బాలుఁడవై రేపల్లెలోఁ బాలు దాగేవేళ
యీలీలనే పవళించి యిరవైతివా
గోలవై తొట్టెలలోన గొల్లెత లూఁచి పాడఁగా
ఆలకించి విని వాట లవధరించితివా 11కోరి11
కొంచక మధురలోనఁ గుబ్జఇంట నీ లాగుల
మంచాలపైఁ బవళించి మరగితివా
చంచులద్వారకలోన సత్యభామతొడమీఁద
ముంచి యీరీతి నొరగి ముచ్చటలాడితివా 11కోరి11
పదియారువేలింతుల పాలిండ్లు తలగడలై
పొదల నిటువలెనే భోగించితివా
యెదుట శ్రీ వేంకటేశ ఇట్టె తిరుపతిలోన
నిదిరించక శ్రీభూమినీళలఁ గూడితివా 11కోరి11
25-285
ఇరవు = స్థానము, చోటు, స్థిరము
గోల = an artless innocent woman, ముగ్ధ, ముగ్ధుడు
లాగుల =పెనగులాట
మరగు=అలవాటుపడు
చంచుల=ఆముదపు చెట్లు ఎక్కువగాగల(?), పక్షిముక్కు ఆకారంలో
ముంచి=మునుగజేయు, to sbmerge
పొదల=వర్ధిల్లు, ప్రకాశించు, పొదలలో అనికూడ అర్ధం చెప్పుకోవచ్చును
0 comments:
Post a Comment