గౌళ
వీదు లవీదులనేఁగే విట్ట(ట్ఠ)లేశా ! వట్టి-
వేదలెల్లాఁ బాసె నిఁక విట్టలేశా ! 11పల్లవి11
వేడుకకాఁడవై తివి విట్టలేశా ! నీకు
వీడె మందుకోవోయి విట్టలేశా !
వీడుజోడునగవుల విట్టలేశా ! నీ పై
వేడెవె ట్టె మావలపు విట్టలేశా ! 11వీదు 11
వెలసె నీమోవి గడువిట్టలేశా ! నీకు
వెలుపలే లోనయ్య విట్టలేశా
వెలలేని మహిమలవిట్టలేశా ! పూవు -
విలుతునిఁ గన్నతండ్రి విట్టలేశా ! 11వీదు11
వెన్నెలతేటమాఁటల విట్టలేశా ! నా -
విన్నపానకే కూడితి విట్టలేశా !
వెన్నతో శ్రీవేంకటాద్రి విట్టలేశా ! నీవు
వెన్నుఁడవు వెయినామాల విట్టలేశా ! 11వీదు11
20 - 449
0 comments:
Post a Comment