ప్రతిష్ఠానపురం లోని పుష్పలావికలు
సీ.
కర్ణాట కామినీ కర్ణావతంసిత
కర్ణి కార పరాగ గణము రాల్చి
మధు రాధ రాచర ల్మధురాధరా పున
ర్మిధువ నోత్సాహము ల్నిగుడఁ జేసి,
కుంత లాంచ దరాళ కుంత లాగరుగంధి
కుంత లామోదము ల్కొల్ల లాడి,
లాట శుద్ధాంత లలాట ఘర్మాంబు లీ
లాటన క్రియలఁ బాయంగఁ ద్రోసి,
గీ.నలిన కువలయ నవ లయ నటన పటిమ
చలిత లలితవ దళికుల కలకల కల
వితత గతి కృతి చతురత వెలసి సొలసి,
విసరు మరు దంకురంబు ల వ్వీట నెపుడు. 28చ.
"కలువల కేమి ? నీ విపుడు కన్గొనినంతనె తెప్ప తెప్పలౌ,
నలినము లెన్ని రావు లలనామణి ! నీ విటు మోము ద్రిప్పినన్ ?
వలసిన సంపెగ ల్గలుగవా మఱి నీ మెయి చాయ దాయ ? " నం
చెలమి విటాళి పల్క , విరు లిత్తురు నప్పురిఁ బుష్పలావికల్. 29
0 comments:
Post a Comment