నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Sep 5, 2009

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ

తెలుగు
లోనె బ్లాగండోయ్
తెలుగులోనె రాయండోయ్
తెలుగులోనె చదవండోయ్
తెలుగు మాట వినరండోయ్.

తెలుగే మన మాతృభాష
తెలుగే మన ఆంధ్రభాష.
తెలుగే మన జీవ శ్వాస
తెలుగే మన చేతి వ్రాత.

తెలుగే మన కంటి వెలుగు.
తెలుగే మన ఇంటి జోతి.

తెలుగే మన మూలధనం
తెలుగే మన ఆభరణం.

తెలుగును ప్రేమించుదాం
తెలుగును వినిపించుదాం
తెలుగును వ్యాపించుదాం.
తెలుగును రక్షించుదాం.

తెలుగుకు లేదోయ్ శాపం
తెలుంగు పలుకే మనదోయ్.

తెలుగన్నా, తెలుఁగన్నా,
తెనుగన్నా, తెనుఁగన్నా,
తెలియరొ అది తేనె వూట
తెలుపరొ ప్రతి పూట పూట.

తెలుగంటే నన్నయ్యా
తెలుగంటే తిక్కన్నే
తెలుగంటే పోతన్నా
తెలుగంటే శ్రీనాథుడు.

తెలుగంటే అల్లసాని
తెలుగంటే తెన్నాలే
తెలుగంటే సూరన్నే
తెలుగంటే రాయలెగా.

తెలుగంటే అన్నమయ్యా
తెలుగంటే త్యాగయ్యే
తెలుగంటే క్షేత్రయ్యా
తెలుగంటే రామదాసు.

తెలుగంటే ఎంకిపాట
తెలుగంటే జానపదం
తెలుగంటే బాపిరాజు
తెలుగంటే బ్రౌనుదొరా.

తెలుగంటే జంటకవులు
తెలుగంటే శ్రీశ్రీ శ్రీపాదే
తెలుగంటే పానుగంటి
తెలుగంటే విశ్వనాథ.

తెలుగంటే కందుకూరి
తెలుగంటే గురజాడ
తెలుగంటే గిడుగేరా
తెలుగంటే సీనారే.

తెలుగే పాపయ్యశాస్త్రి
తెలుగే గుఱ్ఱం జాషువ
తెలుగే వెంకటచలమూ
తెలుగేరా రావిశాస్త్రి
తెలుగే కాళీపట్నం.

తెలుగంటే మొక్కపాటి
తెలుగంటే ఆరుద్రా
తెలుగంటే ముళ్ళపూడి
తెలుగురమణ బాపుబొమ్మ.

తెలుగు మాట లొలుకు తేనె
తెలుగు సినిమ విశ్వనాథ
తెలుగు పాట కృష్ణశాస్త్రి
తెలుగు నోట ఘంటసాల.

తెలుగే శృంగార పదం
తెలుగే బంగారు రథం
తెలుగే శ్రీకృష్ణు మురళి
తెలుగే మన బాలమురళి.

అందుకే

తెలుగు లోనె బ్లాగండోయ్
తెలుగులోనె రాయండోయ్
తెలుగులోనె చదవండోయ్
తెలుగు మాట వినరండోయ్

7 comments:

డా.ఆచార్య ఫణీంద్ర said...

తెలుగుకు, తెలుగులకు వందనం !
తెలుగు కీర్తిని చాటిన మీకు అభినందనం !!

రవి said...

తెలుగుదనం చిమ్ముతోంది. ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. said...

తెలుగునగల తీయదనం
తెలుగున కల కమ్మదనం
తెలుగు కవుల కావ్య ధనం
తెలుగు చరిత మూల ధనం

తెలియఁ జేసి వెలుగు చూపి
తెలుగు వెలుగు నందఁ జేసి
భావ కవిత శక్తి చూపె.
నరసింహా అద్భుతమోయ్.

చిలమకూరు విజయమోహన్ said...

తెలుగు వెలుగు ప్రకాశానికి వందనం! అభివందనం!

రాఘవ said...

మా తెలుగుతల్లికి మల్లెపూదండ :)

rākeśvara said...

ఇప్పటికే బ్లాగుతున్న వారికి కాకుండా కొత్త వారికి వినిపించదగ్గ కవిత ;)

Unknown said...

లెస్స పలికితిరి నరసిహం గారు మీకు దన్యవాదములు

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks