నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Sep 5, 2009

పాయని తనమీఁది పరమానురక్తిఁ దోయజాక్షుం డల తొలినాఁటి రాత్రి-

అన్నమాచార్య చరిత్రము

అన్నమయకు వైష్ణవయతిచే పంచసంస్కారములు

పాయని తనమీఁది పరమానురక్తిఁ
దోయజాక్షుం డల తొలినాఁటి రాత్రి-

ననఘుండు పరిపరాయణచిత్తుఁడైన
ఘనవిష్ణుఁడను మౌని కలలోన వచ్చి

దయమీఱ నిట్లనుఁ దాళ్ళపాకాన్న-
మయ నామకుండైన మద్భక్తుఁ డొకఁడు

వడుగు నల్లని చిన్నవాఁడు నన్నెపుడు
నడుఁకక సంకీర్తనము సేయు నతఁడు

ముద్దుగారెడువాఁడు మోహనంబైన-
మద్దికాయలవాఁడు మనవాఁడె వాఁడు

గుదిగొన్న నునుపట్టుకుచ్చుల దండె
ముదమున నిజభుజంబున నించువాఁడు

కడవేగ రేపు నీకడ కేఁగుదెంచుఁ
దడయక నీవు ముద్రాధారణంబు

గావింపు నా మాఱుగా వాని కనుచు
దేవుఁడు తనదు ముద్రిక లిచ్చె; నంత

యతి మేలుకొని యరుదంది గోవిందు-
సతమైన భక్తవాత్సల్యంబుఁ బొగడి

యఱిముఱి సూర్యోదయంబున కెల్ల
మఱవక నిత్యకర్మంబులు దీర్చి

కరమున శంఖచక్రపుముద్ర లంది
హరి యాజ్ఞ వాకిటి కరుదెంచి నిలిచి

కేలిమై వెన్నునిఁ గీర్తింపుచున్న-
బాలుని రూపు తప్పక విలోకించి

యెఱుఁగఁగా హరి యానతిచ్చినయట్టి-
గుఱుతులన్నియు దొరకొన సంతసమున-

నన్న నీ పేరేమి యనిన నా వడుగు-
నన్నయ నా నామమని సాఁగి మ్రొక్కి

వినుతింపఁ జూచి సవిస్మయుండగుచు
మునినాథుఁ డాతని ముద్దుసేయుచును

తనచేత నీవు ముద్రాధారణంబు
గొనకొని సేయించుకొనఁగ నోపుదువె

యన విని శిశువు కృతార్థుండనైతి-
నన విని వేదమార్గానుసారమున-


నాతని శంఖచక్రాంకితుఁ జేసి
రీతిగాఁ బంచ సంస్కృతులు గావించి

శ్రీనాథుఁ డానతిచ్చిన ప్రకారంబు
తాను వైష్ణవులు నాతఁడు భుజియించి

తన కలగన్న యంతయుఁ దేటపఱచి,
దులగుచు....................................


గ్రంథపాతము
వేద్యంబులగు వేద వేదాంతముఖ్య-
విద్యల నధికులై వెలసియుండుదురు

తెల్లంబుగా దేహదేహిభావమున-
నెల్లవస్తువులును నీవెకాఁ దలఁచి

పరచింత లుడిగి నా పైనె విన్యస్త-
భరుఁడనై యుండు శుభంబులన్నియును-

ననఘాత్మ ! నినుఁ జెందునని వరంబిచ్చి
జననివాక్యముఁ ద్రోయఁజనదు కుమార !

పోయి రమ్మనిన నప్పుడు మేలుకాంచి
యా యచ్యుతునిఁ గొనియాడి మ్రొక్కుచును

జనినియు దాను నిచ్చలుఁ దొంటిపురికిఁ
జనుదెంచి నిజనివాసముఁ బ్రవేశించె;-

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks