పాడి
తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడే
కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు. IIపల్లవిII
కను దెరచినంతనే కలుగు నీ జగము
కనుమూసినంతనే కడు శూన్యమౌను
కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును
తన మనోభావనలఁ దగిలి తోఁచీని. IIతొల్లిII
తలఁచినంతనె యెంత దవ్వయిన గాన్పించు
తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము
పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు
పలుచంచలవికారభావ మీ గుణము. IIతొల్లిII
ముందు దాఁ గలిగితే మూఁడు లోకములుఁ గల
వెందు దా లేకుంటే నేమియును లేదు
అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీఁడె
కందువల నితని సంకల్ప మీపనులు. IIతొల్లిII
4-73
Sep 15, 2009
తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడే కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు.
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు.
భావం బాగుంది, ఇది ఎవరు రాసారు?
అన్నమయ్య
Post a Comment