నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Aug 29, 2009

విత్తులనుండి చెట్లు ప్రభవించుట యున్నది గాని, పండ్లె యు త్పత్తిని బొందుటబ్రముగదా ?

ఈ రోజు తెలుగు భాషా దినోత్సవము। అందుకని అందమైన తెలుగు పద్యాలను కొన్నిటిని ఏర్చికూర్చుదామని ఈ ప్రయత్నం।
ఆదిభట్ల నారాయణ దాసుగారు ఓ అవధానంలో పూరించిన అందమైన సమస్య ఇదిగో మీకోసం।
"అమిత విజృంభణమ్ము లబలా ! తగునా ? సుజనాళికెప్పుడున్।"
చ।
క్రమమెఱుఁగంగ లేని విధివ్రాత బలమ్మునఁ దమ్ము మోయు మ
ధ్యము పయి నీదు చన్ను లిసుమంతయు నక్కటి కంబు మాని యు
బ్బి మధ కఠోర భావమున విస్తరమంది చలింపఁజేసి జృం
భము నటు చూపకున్న క్షత మర్ధన బాధల పాలుగావుగా
అమిత విజృంభణమ్ము లబలా ! తగునా ? సుజనాళికెప్పుడున్

శృంగార మధురమైన పూరణ.

సెట్టి లక్ష్మీనరసింహం గారి సరస చాటువు ఒకటి ఆస్వాదించండి।
ఉ।
విత్తులనుండి చెట్లు ప్రభవించుట యున్నది గాని, పండ్లె యు
త్పత్తిని బొందుటబ్రముగదా ? వనమాలి సుతుండు స్త్రీలకున్
హృత్తటమందుఁ జిన్నపుడె రెండిసుమంతలు విత్తు లుంచఁగాఁ
గ్రొత్త వయస్సునాటి కవి రూపగు గుత్తపు దబ్బ పండ్లుగా.

తిరుపతి వేంకట కవులు
ఓ సారి గద్వాల రాజుగారు తిరుపతి వేంకట కవులను -స్త్రీలకు సౌందర్యహేతువులైన అవయవాలన్నీ పురోభాగంలో ఉండగా జడ మాత్రం వెనుక ఉండటానికి కారణం ఏమిటని అడిగారట। దానికి వారు
సీ॥
పురుషాయిత మొనర్చు పూఁబోఁడి కటిమీఁద
నాట్యంబు సల్పు పుణ్యంబు కొఱకొ ?--ఇలా ఓ పద్యం చెప్పారట।
అప్పుడు రాజా వారు" ఏదో ఉపద్రవం వచ్చినట్టు "చెప్పగలరా అని ప్రశ్నించారట। దానికి వారు
మ॥
ఎదుటన్ వర్తిలునట్టి యంగముల కెంతేనిన్న ఖాదిక్షతా
పద పల్మాఱును గల్గు సంగతిని దాఁ బ్రత్యక్షముం జూచి నె
మ్మదిలో భీతిలి చాటు చోటనుచు సంభావించి వెన్నంటుచున్
బొదలంబోలును వేణి, లేకునికిఁ దాముందుండ కట్లుండునే ?
అక్షర చిత్రాలు చాటువులలోనివి చిత్ర విచిత్రంగా వున్నవి అక్కడక్కడా కనిపిస్తుంటాయి। వెలుగోటి యాచేంద్రుని ప్రస్తుతి యీ క్రింది చిత్రం।
సీ।
ధరసుధా । రసుధా। సుధా। ధార। కదళికా
దళికా। ళికా। కా। రకలిత మగుచు
మవరమా। వరమా। రమా। మా। ను। జలవలీ
లవలీ। వలీ। లీల। ల।వనిమెరయ
శరతుషా। రతుషా। తుషా। సా। ర । లవసితా
వసితా। సితా। తా। రఫణిసమంబు
శరదశా। రదశా। దశా। శా।ంత। భగణితా
గణితా। ణితా। తా। రకా। పథంబు
గీ।
ఖగముఖా। గముఖా। ముఖా। ఖా। గ మగుచు
హరిపురా। రిపురా। పురా। రాతి। నితియు
భరసభా। రసభా। సభా। భావ్యమగుచు
యశము। శము। ము। ద మొదవు యాచాధిపతి। (చా।రత్నా। పుట १४९)

పై పద్యపాదాలలోని సమాసాల విరుపులలో చిత్రాన్ని కల్పించాడు కవి।
'ధరసుధా ' దీనిలో మొదటి ధకారాన్ని తీసివేస్తే 'రసుధా' అవుతుంది। మరల దానిలో మొదటి అక్షరాన్ని విసర్జిస్తే 'సుధా' అవుతుంది। తరువాత' సు ' పోయి 'ధా' మిగులుతుంది। వీటికి అర్థాలను చెప్పుకోవాలి। అనులోమ విలోమాల వలె ఇందులో అక్షర విసర్జనం ఉంది।

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks