నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Aug 21, 2009

విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో వాడని ఇతర ఛందస్సులు-వాటి వివరణ

కీ.శే. డా. పంపన సూర్యనారాయణగారు , తెలుగు రీడరు, మహారాణీ కాలేజి, పెద్దాపురం. వీరు పెద్దాపురం బాంకు కాలనీలో మా వీధిలోనే ఉండేవారు. వారితో వారి చివరి సంవత్సరాలలో రెండుమూడు సంవత్సరాల పాటు నా స్నేహం కొనసాగింది.మా యింటికి వారు రావటం నేను వారింటికి సాయంకాలం వెళ్ళి సాహిత్య చర్చలతో కాలం గడుపుతుండేవాళ్ళం. వారు మరణించి సుమారు 6-7 సంవత్సరాలయ్యుంటుంది. వారి భార్యాపిల్లలు ప్రస్తుతం మా యింటి యెదురింటిలో అద్దెకు ఉంటున్నారు. నాకీ రోజే వారు వారి యం.ఫిల్ డిగ్రీ నిమిత్తం విశ్వనాధ వారి శ్రీమద్రాయణ కల్పవృక్షము - పద్యశిల్పము అనే విషయం మీద ధీసిస్ సమర్పించారని తెలిసింది. వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను అడిగి ఆ పుస్తకాన్ని తెచ్చి చదవటం మొదలుపెట్టాను. వారి కుటుంబ సభ్యుల అనుమతితో కొన్ని కొన్ని విషయాలు నా బ్లాగులో కాలక్రమేణా అక్కడక్కడా వ్రాస్తాను. దీనికై వారి కుటుంబ సభ్యులకు నా యీ బ్లాగు ముఖంగా నా కృతజ్ఞతలు తెలియ జేసు కుంటు న్నాను.
ఇంకా దొరికిన ఛందస్సులు:
మొత్తం ఛందస్సులు 26 విధములు. అవి.
ఉక్త, అత్యుక్త, మధ్య, ప్రతిష్ఠ, సుప్రతిష్ఠ, గాయత్రి, ఉష్ణిక్కు, అనుష్టుప్పు, బృహతి, పంక్తి, త్రిష్టుప్పు, జగతి, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, అష్టి, అత్యష్టి, ధృతి, అతిధృతి, కృతి, ప్రకృతి, అకృతి, నికృతి, సంకృతి, అతికృతి, ఉత్కృతి, అనం బ్రవర్తిల్లు. అందు ఉక్తాదిచ్ఛందంబు లొక్క యక్షరంబునుండి యొండొంటి కొక్కొక్క యక్షరంబుగా షడ్వింశాక్షర పర్యంతంబుఁ బెరుగు.అంటే మొట్టమొదటి దైన ఉక్తా ఛందములో ప్రతి పాదానికి ఒక్క అక్షరం మాత్రమే ఉంటుంది. ఆపైన ప్రతి ఛందము ఒక్కొక్క అక్షరం చొప్పున పెరుగుతాయన్నమాట.

అంగజాస్త్ర వృత్తము (భ, మ, స, గ- 1,2 పాదములకు, మ, స, జ, గ-3,4 పాదములకు)
దాబలేంద్రోదారభమంబుల్
పూనిసగా ప్తిం బొంపిరివోవన్
జానార న్మసజంబు గస్థితం
బై నీజంజను నంగజాస్త్ర మై.

అంబుజ వృత్తము(సుప్రతిష్ఠాచ్ఛందము) పాదమునకు 5 అక్షరములు.(భ, వ)
ఇంగు భకా - రంబును వకా - రంబును జుమీ - యంబుజ మగున్.

అంబురుహము (భ, భ, భ, భ, స, వ)13
(కృతిచ్ఛందం)పాదమునకు 20 అక్షరములు.ప్రాస నియమం కలదు.
భాభరంబులపై సవలొందుచు భానువిశ్రమయుక్తమై
యీభువి నంబురుహంబనఁగాఁ జను నిందువంశనృపాగ్రణీ.


అర్కుటము (న, జ, భ, జ, జ, వ)
ఆలోల (మ, స, మ, భ, గ, గ) 8
ఇందువదన (భ, జ, స, న, గ, గ)9

ఉత్సుకము(భ, భ, ర) (బృహతీచ్ఛందం) పాదమునకు 9 అక్షరములు. ప్రాస నియమం కలదు.
త్సుక మౌ భభరంబులన్ - మత్సరి మాన విమర్థనా.

ఉపజాతి (ఒక పాదం ఇంద్రవజ్రము, ఒకపాదం ఉపేంద్రవజ్రం అయితే అది ఉపజాతి అవుతుంది.)8
యింద్రవజ్రాఖ్య ముపేంద్రవజ్ర (త, త, జ, గ, గ)
శ్రయంబు గాఁగా నుపజాతి మయ్యెన్.(జ, త, త, గ, గ)

ఉపేంద్రవజ్రము (జ, త, జ, గ, గ) 8(త్రిష్టుప్ఛందం) పాదమునకు 11 అక్షరములు.ప్రాస నియమం కలదు.
పేంద్రవజ్రాహ్వయ మొప్పునిం పై
యుపేంద్రపుత్త్రా జతజోక్తగాలన్.

ఉష్టిక్
ఊర్వశి (న, త, త, ర, గ) 8

కన్యావృత్తం(ప్రతిష్ఠాచ్ఛందం) పాదమునకు 4 అక్షరాలుంటాయి.
పొత్తై మాగా- వృత్తిం గన్యా-
వృత్తం బయ్యెన్ - జిత్తం బారన్.

కమల విలసితము ( న, న, న, న, గ, గ ) 9
కలరవము (స, న, న, న, ల, గ ) 8
కలహంసి (త, య, స, భ, గ )

కలితాంతము ( త, ర, జ, వ ) 8 పాదమునకు 11 అక్షరాలు
కుటగతి (న, జ, మ, త, గ)

కుమారలలిత (జ, న, గ) (ఉష్ణిక్కుచ్ఛందం) పాదమునకు 7 అక్షరములు. ప్రాస నియమం కలదు.
కుమార లలితకున్ - సమగ్రజనగముల్.

కుమారి (న, జ, భ, జ, గ, గ) 9

కుసుమితలతావేల్లి తావృత్తము (మ, త, న, య, య, య)11(ధృతిచ్ఛందం)పాదమునకు 18 అక్షరములు.ప్రాస నియమం కలదు.
స్వశ్రేయస్సిద్ధిన్ మతనయయవ్యాప్తిచేఁ జర్మవాసో
విశ్రామం బొప్పగుం గుసుమిలతావేల్లితా వృత్తమయ్యెన్.

కోమల వృత్తము(న, జ, జ, య, -బేసి పాదములకు, జ, భ, స, జ,గ - సరిపాదములకు)
సలలితరీతి నజాయగణంబుల్
చళుక్యభూప జభసజస్థగస్థితిన్
మలయుచు నర్థసమర్థతచేత
న్వెలుంగఁ గోమల మను వృత్త మొప్పగున్.

క్రౌంచపదము (భ, మ, స, భ, న, న, న, య)18 (సంకృతిచ్ఛందం) పాదమునకు 24 అక్షరములు. ప్రాస నియమం కలదు.
ప్రాంచిత తేజఃకుంచితవైరీ భమసభననన రిచిత రీతిన్
అంచితమయ్యెం గ్రౌంచపదాఖ్యం బరుగతహరిదియతి నభివృత్తిన్.

గీతాలంబనము (త,జ,జ,న)
గోవృష (మ, త, య, స, గ, గ) 5
గౌరి (న, న, న, స, గ)
చంచరీకాతతి (య, మ, ర, ర, గ) 7
చంద్రలేఖ (న, స, ర, ర, గ) 7

చంద్రశ్రీ(య, మ, న, స, ర, గ)11
(అష్టిచ్ఛందం) పాదమునకు16అక్షరములు.ప్రాస నియమం కలదు
గుం జంద్రశ్రీదా హారవిరణాయత్తనమైనం
బ్రగాఢంబై యొప్పున్ య మ న స బద్ధాగ్రగాప్తిన్.

చౌపది(
భ స గానల ములపైని గరంబు
న్నెసఁగఁగ మూఁడవయెడ విరమంబుం
బొసఁగినఁ జౌపదిఁబొలుచు రసంబుం
గసవరముగఁ దగుఁ ప్రాసంబున్.

జలంధరము ( భ, భ, భ, జ, వ) 11

తనుమధ్యావృత్తం (త, య) (గాయత్రీచ్ఛందం) పాదమునకు 6 అక్షరములు. ప్రాస నియమం కలదు.
ప్పున్ తయ యుక్తిం - జెప్పం దనుమధ్యన్।

తరువోజ
నలనామకంబులు నగణాంతములుగ నాలుగంఘ్రులయందు నాలుగుఁగూర్చి
వళులు మూఁడెడలను వరుసతో నిల్ప వలయు మూఁడవగణవర్ణంబు మొదల
నిలుపంగ నివ్విధి నిర్మించి విశ్వనృపతికి నిచ్చిన నింపుసొంపారుఁ
దలకొని తగఁబ్రాలు దంపెడిచోటఁ దరుణులచే సొంపుదనరుఁ దర్వోజ.

తోవకము (న, జ, జ, య)
తామరసము

త్రిపది(1వ పాదము ४ ఇంద్రగణములు,२ వపాదము 2ఇంద్రగణములు,२ సూర్యగణములు, 3వపాదం 2ఇంద్రగణములు,१ సూర్యగణము)
త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు
ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల
ద్యుపతిద్వయార్కులునౌల.

దండకము(హ-న-స-త వీనిలో ఏదో ఒక గణముతో దండకాన్ని పూర్తిచేసి చివర ఒక గురువుతో ముగించాలి)
విద్వాంసు లెల్లన్ హ కారంబె కానీ న కారంబెకానీ స కారంబె కానీ వచింపం దగున్ముందుగా నిందు గాదేని యాదిం దకారంబు గల్పించి యామీది వెల్లన్ దకారంబులే మెండుగా నిచ్చకు న్వచ్చు నందాక నిర్మించి గుర్వంతముం జేసినన్ దండకంబండ్రు కాదంబినీ నీలగోపాల బాలా నమస్తే పునస్తేనమః

ద్విపది - మంజరి(३ ఇంద్రగణములు, १ సూర్యగణము। ద్విపదికి వళి,ప్రాస రెండూ ఉంటాయి। మంజరికి
ప్రాస ఉండదు।)
క్రత్రయంబును వితృండుఁ బాద
విక్రీడితులు మృదుద్విపదికి నెపుడు
ళియుఁ బ్రాసంబును లయు దీనికిని
దు ప్రాసంబండ్రు రుస మంజరికి.

ధృవకోకిల (న, భ, ర, స, జ, జ, గ) 12
శువిలాస ముకుంద కేశవ శూలిభవ్య విరామమున్
రసంబులు జాగముల్ దగు వ్యమై ధృవకోకిలన్.

నది ( న, న, త, జ, గ, గ) 8

నాందీముఖి (న, స, త, త, గ, గ) 8

నారీ వృత్తం(మధ్యాచ్ఛందం) పాదమునకు 3 అక్షరాలుంటాయి.నారీవృ-త్తారంభం-బారు న్మా-కారం బై.

నారీప్లుతవృత్తం(1,3 పాదములు ఒకవిధంగా, అలానే 2,4 పాదములొకవిధంగా ఉంటాయి.)
దానోదార శ్రీమతా గానియుక్తిం గానంగఁదాజస్థ గగప్రసక్తిన్
మానై చాళుక్యక్షమాపాలరమ్య స్థానంబునారీప్లుత సంజ్ఞమయ్యెన్.

ప్రమితాక్షరము (స, జ, స, స)

పణవము
(మ,న,య,గ) 6 (పంక్తిచ్ఛందము) పాదమునకు 10 అక్షరములు. ప్రాస నియమం కలదు.
అందంబై మనయుగముల్ సొంపిం - పం ప్పొందక ణవం బయ్యెన్.

పద్మకము ( న, భ, జ, జ, జ, గ)11(అష్టిచ్ఛందము) పాదమునకు 16 అక్షరములు.ప్రాస నియమం కలదు.
జ జద్వయ గకార సనాతన విశ్రుతిం
బ్రవమై పరఁగు సత్కృతిఁ ద్మకకృత్తమై.

పాలాశదళము (15 లఘువులు ,గ, గ)

ప్రమితాక్షరము(స, జ, స, స) 9 (జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములు.ప్రాస నియమం కలదు.
లక్రియాప్తిఁ బ్రమితాక్షర మై
రున్ సజస్థ స స యంత్రిత మై.

ప్రహరణకవిత (న, న, భ, న, ల, గ)

ప్రహర్షిణి (మ, న, జ, ర, గ)8 (అతిజగతీచ్ఛందం) పాదమునకు 13 అక్షరములు.ప్రాస నియమం కలదు.
ప్రావీణ్యప్రదయొనరం బ్రహర్షిణిందాఁ
గావించున్ మ న జ ర వ్రజంబుధాత్రిన్.

ప్రియకాంత (న, య, న, య, న, గ)11(అష్టిచ్ఛందం) పాదమునకు16అక్షరములు.ప్రాస నియమం కలదు
న యయుక్తిం దగ సణంబున్ గురువొందున్
నితము దిగ్విశ్రమమును నించుం బ్రియకాంతన్.

పృథివీవృత్తము(జ, స, జ, స, య, వ)12(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
సంబులు జసంబులున్ యవనిక్త రూపంబులై
పొసంగఁ బృథివీసమాఖ్యయగుఁ భూషవిశ్రాంతితోన్.
బలభిన్మణి (భ, స, న, న, గ) 7
భంభరగానము(న, న, భ, భ, గ) 8
బింబము

భద్రిణీవృత్తం(భ, ర, న, ర, న, ర, న, గ)12
(ఆకృతిచ్ఛందం) పాదమునకు 22 అక్షరములు. ప్రాస నియమం కలదు.
భాదిరనత్రయంబు గురు యుక్తమై గిరిశవిశ్రమప్రకటమై
మేదిని నొప్పు భద్రిణికి నందు మేరునగధీర విశ్వనృపతీ.

భూతిలకము (భ, భ, ర, స, జ, జ, గ)10(అతిధృతిచ్ఛందం)పాదమునకు 19 అక్షరములు.ప్రాస నియమం కలదు.
భూతిలకం బగు భా ర సంబులఁ బొంది జా గ ము లుండినన్
భూపతిస్ఫుట విశ్రమంబున భూప విశ్వనరేశ్వరా.

మంజుభాషిణి (స, జ, స, జ, గ) 9
(అతిజగతీచ్ఛందం) పాదమునకు 13 అక్షరములు.ప్రాస నియమం కలదు.
యంబుగాఁగఁ సంబుతో జగం
బులు మంజుభాషిణికిఁ బొందు నందమై.

మత్త (భ, మ, స, గ)7 (పంక్తిచ్ఛందము) పాదమునకు 10 అక్షరములు. ప్రాసనియమం కలదు.
శైశ్రాంతిన్ మభగలోలిం - గ్రాన్ మత్తాఖ్యను నుపట్టున్.

మత్తహంసిని(జ, త, స, జ, గ) 7
మణికమలవిలసితము (స, స, స, స, గ, గ)

మణిగణనికరము (న, న, న, న, స)9(అతిశక్వరీచ్ఛందం) పాదమునకు15అక్షరములు.ప్రాస నియమం కలదు
సత న న న గణము లెసఁగం
రియతిఁ గని మణిణనికర మగున్.
.

మదనము (త, భ, జ, జ, గ, గ) 9

మదన విలసితము(న, న, గ) (ఉష్ణిక్కుచ్ఛందం) పాదమునకు 7 అక్షరములు. ప్రాస నియమం కలదు.
నవిలసిత - ప్రముల్ ననగల్.

మదనార్త (త, య, స, భ, గ, గ)

మయూరసారి (ర, జ, ర, గ) 7(పంక్తిచ్ఛందము) పాదమునకు 10 అక్షరములు. ప్రాస నియమం కలదు.
ర్వు నీరజంబు పైరగంబుల్ - ర్వదా మయూరసారిఁ జెప్పన్.
(మయూరభాషిణి)

మలయజము (న, జ, న, స, న, న, భ, న ల) 8, 15, 22
ళిన విలోచన జనసనంబులుభనగణంబులు టలగమున్
లసి గిరిత్రయహితయతుల్ తగిలయజ వృత్తము హివెలయున్।

మేలనగీతి
గలము రెండునగణములును గలసి ప్రాస మెఱయుఁ
జెలువు దోఁప నెత్తుగీతి వెలయుఁ గృతులయందు
నోలి నగణమొండె హగణమొండె నేడుచేసి
నాలుగడుగులందు నిలిపి నళుపుదోఁప విరతి
వాలి పంచమస్థ యగుచు వచ్చెనేని యొప్పు
మేలనాభిదాన మైన మేలుగీతి కృతుల.

మోహ ప్రలాపము (భ, భ, త, ర, గ) 5
రతి ( స, భ, న, స, గ) 5

రతిప్రియవృత్తము(మ, స, జ, ర, గ, జ, భ, స, జ, గ) ప్రాస నియమం కలదు.
ఖ్యాశ్రీ మనజరగంబులుండఁగాఁ ద
ద్గతంబులై జభసజగంబు లొందగా
వీతాఘప్రముదితవిశ్వభూపా
ధృతిం దలంప నిది రతిప్రియం బగున్.



రమణకము (9 నగణములు, 1 వగణము) 1,9,17,25
మనసిజ జనకసమద రిపు గజహరిమదగజవసు విరమణములతో
నననననననననలగము లెనయగ నరవరనుత రమణక మమరున్.

రాజహంస ( త,త,త,త,త,త,త,త,గ ) 13 ప్రాస నియమము కలదు.


రుచిరము (జ, భ, స, జ, గ) 9
(అతిజగతీచ్ఛందం) పాదమునకు 13 అక్షరములు. ప్రాస నియమం కలదు.
క్రమంబుతో జభసజమ్ము లిమ్ముగా
ర్పఁగా రుచిరమాహ్వయం బగున్.

లత (న, య, న, న, గ) 7
లయవిభాతి(న,స,న,న,స,న,న,న,స,న,న,స,గ) పాదమునకు 34 అక్షరములు.24మాత్రాగర్భితపాదము.
న న స నా కలితన స న న స గం బుల వి
సితతర పాదములఁ బొసఁగు నలు వ్రాలం
బ్రరితములై యలరుఁ బసలయవిభాతి యన
సికులకు వనులకు నొసఁగు జవు లింపై.

వంశము ( జ, త, జ, ర )

వనమంజరి (న, జ, జ, జ, జ, భ, ర)13
(ప్రకృతిచ్ఛందం) పాదమునకు 21 అక్షరములు. ప్రాస నియమం కలదు.
ర న జా జ జ భా గ్భకారయు త్రయోదశయుగ్యతిన్
వినుత మగు న్వనమంజరినాఁ దగువృత్త మింపెసలారఁగన్.

వసంత మంజరి ( న, భ, భ, న, ర, స, వ ) 13( కృతి ఛందము )పాదమునకు 20 అక్షరములు . ప్రాస నియమం కలదు.


వారాంగి వృత్తము(జ, త, జ, గ, గ-1,2 పాదములకు మరియు త, త, జ, గ, గ )
ళుక్యవంశాజతల్ గగంబుల్
చెలంగి యర్థంబునఁ జెంది రీతిం
గ్రాలంగఁ దాయత్తజగానియుక్తిన్
మేయ్యె వారాంగి సమీహితాఖ్యన్.

వాసంతి (మ, త, న, మ, గ, గ)
విద్రుమలత (న, జ, న, న, ల, గ) 8

విద్యున్మాల (మ, మ, గ, గ) 5 (అనుష్టుప్ఛందము) పాదమునకు 8 అక్షరములు
ద్యున్మాగా యుక్తం బైనన్
విద్యున్మాలా వృత్తం బయ్యెన్.

వినయము

వీణారచన వృత్తము(స్వపర స్థాన విషమ వృత్తము)(
చాక్యనయజ్ఞాత యనస్థసగంబుల్
వీణారచనకొందు భువిందససావంబుల్
శ్రేణీందజనస్థితభససేవిత నియతిన్
రాలనెలవై భస నరంబు లోలిగన్.

శ్రీ వృత్తం (ఉక్తా ఛందము) పాదానికి ఒకే అక్షరం . శ్రీశ్రీం-జేయున్.

శరభక్రీడా వృత్తము(య, మ, న, స, ర, గ- 1,2 పాదములు, మ, భ, న, య, య -3,4 పాదములు) పరస్థాన విషమ వృత్తము
తుర్వర్ణాధారా య మ న స ర గ వ్యాప్తి నాద్య
ద్వితీయాం త్యాంఘ్రి ప్రస్తుతగతి నతిస్పష్టమైనన్
ఖ్యాతాసక్తిన్ మ భ న య య తృతీయాంఘ్రినొప్పన్
బ్రతిప్రేమోత్పత్తిం బరఁగి శరభక్రీడ యయ్యెన్.


శాలిని (మ, త, త, గ, గ) 6(త్రిష్టుప్ఛందం) పాదమునకు 11 అక్షరములు. ప్రాసనియమం కలదు.
రాకాధీశాకా రాజన్మ తా గా - నీప్రాప్తిన్ శాలినీవృత్తమయ్యెన్.

శుద్ధవిరాటి (మ, స, జ, గ)6(పంక్తిచ్ఛందము) పాదమునకు 10 అక్షరములు. ప్రాస నియమం కలదు.
క్తం బై మసస్థగ ప్రథా - క్తిన్ శుద్ధవిరాట నాఁ జనున్.

సమాని(ర,జ,వ) (అనుష్టుప్ఛందము) పాదమునకు 8 అక్షరమరలు. ప్రాస నియమం కలదు.
మానికిన్ ర జ వ - వ్యా మొప్పగుం గృతులన్.

సరసిజము (మ, త, య, న, న, న, న, స)10
(వికృతిచ్ఛందం) పాదమునకు 23 అక్షరములు.ప్రాస నియమం కలదు.
చాళుక్యక్ష్మాపాలవరేణ్యా శ్రయమతయనననిచయయుతననసల్
చాలై యింపై వ్రాలఁ దనర్పన్ రసిజమగు నిలఁజవులకుఁ గుదురై.

సింధురవృత్తం (న, న, న, న, స, భ, భ, భ, గ) 12 (అభికృతిచ్ఛందం) పాదమునకు 25 అక్షరములు ప్రాస నియమం కలదు.
క్రమున న న న న స భ భ గ గణ క్రాంతిదినాధిపవిశ్రమమై
ప్రదధలసలయభరితవిరచనన్ బంధురసింధురవృత్తమగున్.

సింహరేఖ(ర, జ, గ, గ)
(అనుష్టుప్ఛందము) పాదమునకు 8 అక్షరమరలు. ప్రాస నియమం కలదు.
జాగ్రగా నియుక్తిన్ - గోరి సింహరేఖ యొప్పున్.

స్త్రీ వృత్తం(అత్యుక్తాచ్ఛందం) పాదానికి రెండేసి అక్షరాలుంటాయి.స్త్రీరూ-పారుం-గారూ-పారున్.

స్వాగతము (ర, స, భ, గ, గ) 7
(త్రిష్టుప్ఛందం) పాదమునకు 11 అక్షరములు. ప్రాసనియమం కలదు.
స్వాతంబు రనభంబు గగాస్తిన్
సాగు విశ్వనృపచంద్రకులాఢ్యా.

సుకాంతి(ప్రతిష్ఠాచ్ఛదం) పాదానికి 4 అక్షరాలుంటాయి. ( జ, గ ) ప్రాస నియమం కలదు.
గంబులం-దగున్ సుకాం-తిల్పిత-ప్రల్భతన్.

సురలత(న, య) (గాయత్రీచ్ఛందం) పాదమునకు 6 అక్షరములు.ప్రాస నియమం కలదు.
సులతఁ జెప్పన్ - సొరిది నయంబుల్.

సుమంగలి ( స, జ, స, స, గ)

షట్పది(౬ ఇంద్రగణములు,१ చంద్రగణము,)
సుపతులిరువురు సురపతులిద్దఱు
సుపయుగమ్ముతో సోముండును
రువడిఁబెనఁగొన నదురుగ షట్పది
రిబ్రాసంబులు దనరారంగను.

క్షమ(క్షప) (స, న, త, త, గ) 8

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks