నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

May 20, 2009

మొదటి సంవత్సరం పూర్తి

ఈ బ్లాగు తన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నది.
దీనిలో ఎక్కువగా అన్నమయ్య సంకీర్తనలు, శ్రీమదాంధ్రభాగవతం లోని దశమ స్కంధం- కొన్ని ఘట్టాలు, కరుణశ్రీ గారి పద్యాలు కొన్ని, ముత్యాల సరాలు, నేను కొత్తగా బ్లాగ్ ముఖంగా నేర్చుకుని ఎన్నికల సందర్భంగా వ్రాసిన పద్యాలు కొన్ని, ఇతర తాళ్ళపాక కవుల సంకీర్తనలు , ఉత్పలమాలికలు ఒకటి రెండు ఇలా ఇలా పాఠకులకు నచ్చుతాయనుకున్నవి నాకు నచ్చినవి నేను మెచ్చినవి కలగలిపి పోస్టుచెయ్యటం జరిగింది. దాదాపు ౨౫౦ పోస్టులవరకూ పూర్తయినవి.
ఈ బ్లాగు మాత్రమే కాకుండా ఇంకో ౫ బ్లాగులు కూడా ఈ సంవత్సరంలో మొదలు పెట్టాను. వాటిలో కూడా ఒకోదానిలో సుమారు ౯౦ నుండి ౧౦౦ వరకూ పోస్టులు పోస్టు చెయ్యటం జరిగింది. ఈ మధ్యనే ప్రారంభించిన శ్రీమదాంధ్రమహాభారతం కూడా ౮౦ నుంచి ౯౦ పోస్టుల మధ్య నడుస్తూ బ్లాగరులను సంతోషపెడుతున్నట్లుగా తెలుస్తోంది. నా బ్లాగులను వ్రాతలను చదువుతూ అప్పుడప్పుడూ తమ తమ అభిప్రాయాలను తెలియపరుస్తూ నాకు ఉత్సాహాన్ని కలిగిస్తున్న బ్లాగ్మిత్రులందరికీ నా శత సహస్ర ధన్యవాదాలు ఈ బ్లాగ్ముఖంగా తెలియజేసుకుంటున్నాను.
ప్రేమతో ---- మీ మల్లిన నరసింహారావు

7 comments:

Anil Dasari said...

అభినందనలు.

జాహ్నవి said...

అభినందన మందార మాల
-జాహ్నవి

పరిమళం said...

అభినందనలండీ !

పానీపూరి123 said...

అభినందనలు...

Anonymous said...

అభినందనలు

Anonymous said...

Finally I find Followers here...
Very very very nice work sir....
Thank you sir

Unknown said...

అబ్రకదబ్ర,జాహ్నవి,పరిమళం,పానీపూరి123,అరుణ పప్పు, శ్రీనివాస్ యస్ గార్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు.ఇంటర్నెట్ సరిగాలేక ఆలస్యమయినందుకు నన్ను మీరంతా క్షమించాలి.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks