నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Mar 8, 2009

తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు నెల,నెలా పేదలందరికీ డబ్బు పంచుతారట--వార్త.
ఆ.వె.
తెల్ల కార్డు నిత్తు, పల్లపు భూమిత్తు
కలరు టీవి నిత్తు, కాసు నిత్తు,
నాకు వోటు వేయి, నేను నీ కన్నిత్తు,
కోట్లు కూడ బెడుతు-కుర్చి నెక్కి.

జయప్రకాశ్ నారాయణ అసెంబ్లీకి పార్లమెంటుకీ కూడా పోటీ చేస్తారట--వార్త

ఆ.వె.
రెండు చోట్ల పోటి రీతి గా దన్నావు,
నీతు లెల్ల చాల నెమకి నావు,
చెప్పు టొకట! జే. పి. చేయుట వేరెనా!
కోట్లు కూడ బెడుతు-కుర్చి నెక్కి.

ఆ.వె.
చెప్పు మాట ఒకటి, చేయుట వేరోటి
నాదు మాట నీకె-నాకు కాదు
చెప్పు రంగ నీతి, చేరు దొమ్మ గుడిసె
కోట్లు కూడ బెడుతు-కుర్చి నెక్కి.

1 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

శ్రీ నారసింహా!
అబినందనలు. మీరు వ్రాస్తున్న పద్యాలు , వ్రాయడంలో మీ వుద్దేశ్యము అర్థమయింది.
ఐతే
కుర్చి అనే పదం కాదు - కుర్చీ అనే పదం సరైంది
మకుటం మారిస్తే బాగుంటుందేమో
.
కోఱుకొందు నేను కోట్లు నాకు.
లేదా
వోట్లు వేయమందు కోట్లు కొఱకు.
లేదా
రాజకీయమందు రాజునౌదు.
లేదా
రాజకీయమందు రాజు నవగ.
లేదా
వోట్లువేసినాక కోట్లు గొందు.

పై మూడు పాదాల్లోనే పద్యం పూర్తవాలి
నాల్గవ పాదం వ్యంగ్యం సూచించే మకుటం కావాలి.
ఉదాహరణకి:-
తెల్ల కార్డు నిత్తు, పల్లపు భూమిత్తు
కలరు టీవి నిత్తు, కాసు నిత్తు,
అనుచు చంద్రబాబు మన ముందు కొచ్చెను
కోట్ల విలువఁ జేయు వోట్లు కొఱకు.

అని వ్రాస్తే యింకా బాగా అందంగా వుంటుంది.
ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. అనుసరించే విషయంలో స్వేచ్ఛ మీదేనని మర్రువకండి.
నమస్తే.
చింతా రామ కృష్ణా రావు.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks