సాళంగనాట
నీ వెఱగవా యిది నెఱజాణవు
వోవరిలో మమ్మేల వొరసేవు నీవు IIపల్లవిII
ఆటదానికి సిగ్గులే అందపు సింగారాలు
నీటుతోడ నుండేగుట్టు నిండుసొమ్ము
కూటమిలో వొడికము గురియైన సంపద
గాటమైన వినయము ఘనరాజ్యపదవి IIనీవెII
నేరుపుతో యడఁకువ నిచ్చకల్యాణము
మేరమీర నీ గుణము మించైన మేలు
గారవపు టిచ్చకము కందువ నిధానము
సైరణతోడి నడక సతమైన లాభము IIనీవెII
కడలేనియట్టి వాసి కమ్మిన తంగేటిజున్ను
గుడిగొన్న శీలము కొంగు పసిఁడి
యెడయక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
కడఁ కతో మెలఁ కువ కలిమిలో కలిమి. IIనీవెII 13-308
ధీర విదుషీమణి - డా.పి.చిరంజీవిని కుమారి
1 day ago
0 comments:
Post a Comment