ఈ అధ్యాత్మ సంకీర్తన అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలు 2వ సంపుటములో 92 వ కీర్తన గాను,పెద తిరుమలాచార్యుల అధ్యాత్మ సంకీర్తనలు 15వ సంపుటంలో 148వ కీర్తనగాను రెండు చోట్లా కనిపిస్తుంది.
సామంతం
ఇద్దరు దేహసమ్మంధ మిదివో మాయ
గద్దించి యాడవుండునో కడసారీ తాను
తోడఁబుట్టినమమత తొడఁగి కొన్నాళ్ళకు
వాడికె పుత్రులమీఁదవలె నుండదు
వేడుక వారెవ్వరో వీరెవ్వరో కాని
కూడపెట్టీ వీరికే కొట్లాడీ వారికే IIఇద్దII
తల్లి మీఁదఁ గలభక్తి తనకే కొన్నాళ్ళకు
యిల్లాలు మీఁదవలె నింత వుండదు
వెల్లవిరి నది యెంత విచారించ నిది యంత
యిల్లు ముంగి లొక్కరిది యెరవు వొక్కరిది IIఇద్దII
నీతితో శ్రీవేంకటేశుఁ నిత్య సేవ కొన్నాళ్ళ-
కీతల సంసారమంత యితవు గాదు
ఆతఁడెట్టు యివియెట్టు అందరూ నెఱిఁగినదే
చేతు లొకటిమీఁదట చిత్త మొకయందు IIఇద్దII 2-92
మగవానికి ఇద్దరి తో ఉండే దైహికమైన సంబంధాలు కాలక్రమేణ మారుతూ వుంటాయి.చివరాఖరికి అతను ఏవైపు ఉంటాడో తెలియదు.
బాల్యంలో తోబుట్టువుల మీద వుండే ప్రేమ కొన్నాళ్ళకు అంటే కాలం గడిచే కొద్దీ తన పుత్రుల మీద వున్నంతగా వుండదు.వారెవరో వీరెవరో అన్నట్లుంటుంది.ఒకరి కోసం కూడబెడతాడు,ఒకరితో కొట్లాడుతాడు.అదేవిధంగా తల్లి మీద తనకు చిన్నతనంలో ఉండే భక్తి పెద్దయ్యాక తన భార్య మీద వున్నంతగా వుండదు.ఒకరిమీద ప్రకటిత మైనంతగా ఇంకొకరిమీద ప్రకటితం కాదు.విచారించాల్సిన విషయం.ఒకరికి యింటిలో సింహభాగం.ఇంకొకరికి అరువుతెచ్చుకున్న వెనక భాగం.అలాగే శ్రీవేంకటేశునికి అనునిత్యము కొన్నాళ్ళు సేవ చేస్తే తరువాత తరువాత ఆ కైంకర్యము సంసారమంత హితవుగా ఉండదు.ఈ విషయాలు అందరికీ తెలిసినవే.చేతులు దేవుడికి నమస్కరిస్తున్నట్లుగానే వున్నా మనసెక్కడో వుంటుంది.
http://www.tirumala.org/music1.htm
ఏ మతం వద్ద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి?
6 hours ago
9 comments:
చాలా బాగుందండి.లోకం లోని ప్రేమల స్వరూపాలను చెప్పే కీర్తన ఇది.
సురేష్ గారూ నెనరులు
Listen this song at http://www.tirumala.org/music1.htm
చాలా బాగుందండి.
బొల్లోజు బాబా
Excellent. అన్నమయ్య కీర్తనల్లో తెలుగుని అప్పటి సమాజ విశేషాలను ఎవరైనా విశ్లేషిస్తే చదవాలని ఓ ఆశ. బ్లాగు మిత్రులలో ఎవరైనా పూనుకుంటే చాలా బావుంటుంది.
@రవి -
http://www.amazon.com/God-Hill-Temple-Poems-Tirupati/dp/0195182847/ref=sr_1_1?ie=UTF8&s=books&qid=1213617099&sr=8-1
http://telpoettrans.blogspot.com/2007/07/blog-post.html
నరసింహ గారు, మీ బ్లాగులో కొత్త టపాకి వ్యాఖ్య రాయడానికి లంకె కనబళ్ళేదు నాకు, మరి ఈ టపాకి మొదటి లంకె రాసినవారు ఎలారాశారో! మీ శస్త్రాస్త్రాల పదం గొప్పగా ఉంది. కామెంటుదామంటే దారి కనబళ్ళేదు.
కామేశ్వరరావు గారికి,రవిగారికి,బాబా గారికి,కొత్తపాళీ గారికి నెనరులు.కంప్యూటరు మీద పనిచేయడం ఇంకా అలవాటు కాని మూలంగా మీ అందరికి కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాను.మీ అందరి దగ్గరనుంచి అందుతున్న ప్రోత్సాహానికి తగినవిధంగా రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని ఉంది.కాని దానికి తగినట్లుగా నా సాంకేతికతను ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.
నరసింహ గారు మీ బ్లాగ్ చాలా బావుందండీ. నాకు ఎప్పటి నుండో "నెయ్యములల్లో నేరేళ్ళో" అనే అన్నమయ్య కీర్తన కి అర్ధం తెలుసుకొనాలని కుతూహలం గా వుండేదండి. అప్పట్లో విశ్వనాథ్ గారు శుభలేఖ సినిమాలో వాడారు ఈ కీర్తనని. మీకు వీలుంటే అది పోస్ట్ చేయ గలరు. ఏ కారణం చేతనైనా మీ బ్లాగ్ లో పోస్ట్ చేయడం ఇష్టం లేకపోతే నాకు మైల్ చేయగలరు (venusrikanth@gmail.com)
Post a Comment