నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

May 21, 2008

కానరటె పెంచరటె కట కటా బిడ్డలను

అన్నమయ్య సంకీర్తనలను నలుగురితో పంచుకోవాలని ,నాకు అర్ధమైనవి వివరిస్తూ,అర్ధం కానివి నలుగురి ద్వారా తెలుసు కోవాలనే కోరికతో ఈ బ్లాగు ప్రారంభిస్తున్నాను.

అన్నమయ్య శృంగార సంకీర్తనలు--vol-5, 253 కీర్తన

Get this widget | Track details | eSnips Social DNA


కానరటె పెంచరటె కట కటా బిడ్డలను
నేను మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని ||పల్లవి||
బాయిటఁ బారవేసిన పాలు వెన్నలును
చేయి వెట్టకుందురా చిన్నిబిడ్డలు
మీ యిండ్ల జతనాలు మీరు సేసికొనక
పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డని ||కాన||

మూసిన కాఁగుల నేయీ ముంగిటి పెరుగులూ
ఆసపడ కుందురా ఆడే బిడ్డలు
వోసరించి మోసపోక వుండలేక మీరు
సేసేరింతేసి దూరు చెప్పరాని బిడ్డని ||కాన||

చొక్కమైన కొప్పెరల జున్నులు జిన్నులును
చిక్కిన విడుతురా చిన్ని బిడ్డలు
మిక్కిలి పూజలు సేసి మెచ్చించఁ దగదా
యెక్కుడైన తిరువేంకటేశుఁడైన బిడ్డని ||కాన||



ఈ కీర్తనలో మన అన్నమయ్య యశోదను ఆవాహన చేసుకొన్నాడు.

పోతన గారి భాగవతంలో
క. ఓ యమ్మ ! నీ కుమారుఁడు
మా యిండ్లనుఁ బాలు పెరుఁగు మననీఁ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభు లాన మంజులవాణీ!


అని యశోదతో చిన్ని కృష్ణుని గురించి గోపికలు చేసిన దూఱులకు యశోద

క. చన్ను విడిచి చనఁ డిట్టిటు
నెన్నఁడుఁ బొరుగిండ్ల త్రోవ లెఱుఁగడు నేఁడుం
గన్నులు తెఱవని మా యీ
చిన్ని కుమారకుని ఱవ్వసేయం దగునే.

తే. అన్య మెఱుఁగడు తనయంత నాడుచుండు
మంచివాఁ డితఁ డెగ్గులు మానరమ్మ!
రామలార! త్రిలోకాభిరామలార!
తల్లులార! గుణవతీ మతల్లులార!

అని పోతన గారిలా యింకా అక్కడితో తృప్తి తీరక మన అన్నమయ్య యశోద చేత గోపికలతో ఈవిధంగా

"కానరటె పెంచరటె కట కటా బిడ్డలను"----అంటూ తెలుగు నేల లో తమ బిడ్డలను గురించి తల్లులు ఇతర స్త్రీలతో తగువాడుతున్నట్టుగా వ్రాసిన కీర్తన యిది. నా కెంతో యిష్టమయిన కీర్తనలలో యిది వొకటి. అందరితో కలసి పంచు కుందామని-------

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks