అన్నమాచార్య చరిత్రము
అన్నమాచార్య సంతతి
సిరివరు మెప్పించి చెలఁగి యా దేవు-
వరమునఁ దనయంతవారిఁ బుత్రకుల
నరసయాచార్యు నున్నతయశోధనునిఁ ,
దిరుమలాచార్యుని ధీవిశారదునిఁ
గాంచి , వారును దనకరణి విద్యలను
గాంచనాంబరు భక్తి కలిమిఁ బెంపొంద
శౌరికథాసుధాసల్లాప గరిమ
ధారుణి నెంతయుఁ దనరారుచుండె ;
మనసునఁ గపటంబు మాని సద్భక్తి
ననఘమౌ నీ యన్నమాచార్యచరిత
వినిన వ్రాసినఁ బేరుకొనినఁ జదివిన
జనులకు నిష్టార్థ సౌఖ్యంబు లొదవు -
Nov 15, 2009
సిరివరు మెప్పించి చెలఁగి యా దేవు- వరమునఁ దనయంతవారిఁ బుత్రకుల
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
వేదుల వారు, మీరు కలిసి చేస్తున్న కృషి అభినందనీయం. చదవటానికి మా సాహిత్య పరిఙానం సరిపోవటం లేదు. అయినా ప్రయత్నిస్తున్నాము. మేము కూడ, ఇద్దరు తోబుట్టువులము. అక్క భారతి నేను విజయ కలిపి విజయభారతి.
Post a Comment