నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Sep 2, 2009

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే

భాద్రపద శుద్ధ త్రయోదశి -బుధవారం, ధనిష్టా నక్షత్రం-1948 సంవత్సరం-ఆరోజు నేను పుట్టానట--నాజాతకం వ్రాసిన పెద్దమనిషి అంటే పురోహితులవారు ఎందుచేతనో మరి ఆరోజు నాటి ఆంగ్ల తేదీని జాతకం కాగితంలో వ్రాయలేదు--అందుచేత ఆ తిథినాడే నాపుట్టిన రోజు అనుకుంటే బాగుంటుంది కదా
ఈ రోజూ అదే తిధి, అదే వారం కాని నక్షత్రం రేపొస్తుందనుకుంటా --2009 సంవత్సరం--
అంటే సరిగ్గా 61 సంవత్సరాలు పూర్తయ్యాయన్నమాట. దీన్నే తిరగేస్తే 16 సంవత్సరాలన్నమాట. అందుకే

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనుకుంటే పోలా ఎంత హుషారుగుంటది.

7 comments:

Bolloju Baba said...

మీరు వ్రాసే ఉత్సాహం, ఎనర్జీ ని బట్టి మీకు ఖచ్చితంగా పదహారే నని నమ్మవలసిందే.

టైటిల్ చూసి కంగారు పడుతూ వచ్చాను. :-))

wish you happy birthday sir.
hope you would enjoy many more happy days like these.

lovingly
bollojubaba

రానారె said...

ఐతే - శతమానం భవతి! :-)

Sujata M said...

Wish u a very happy birth day sir.

Anonymous said...

మీకు జన్మదిన శుభాకాంక్షలు

జ్యోతి said...

61 మీ తనువుకు
16 మీ మనసుకు

పుట్టినరోజు శుభాకాంక్షలు...ఆ శ్రీనివాసుడి కరుణ మీపై ఉండుగాక..

amma odi said...

టైటిల్ చూసి కంగారు పడ్దామండి! టపా చదివి నిజమే సుమా అనుకున్నామండి! పుట్టినరోజు శుభాకాంక్షలు!

Unknown said...

@బాబా గారికి
ధన్యవాదాలండీ. మీరు నా బ్లాగుకు మొట్టమొదటి కామెంటరుగా ఇప్పటికీ నాకు గుర్తున్నారు.
@రానారె గారికి
మీ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. మనం ఈ మధ్యన కలుసుకొని ( బ్లాగుల్లో )చాలా కాలమయింది. మీ పోస్టు "అమెరికాలో కరంటు పోయింది" చాలా చాలా బాగుంది. అభినందనలు స్వీకరించండి.
@సుజాత గారికి
ధన్యవాదాలమ్మా. మీ నాన్నగారి పుట్టినరోజు కూడా ఈరోజేనా లేక 13 వతారీఖునా. వారికి నా శుభాకాంక్షలు తెలియజేయమ్మా.
@వికాసం గారికి
ధన్యవాదాలండీ. నిన్ననే మీ పరిచయం పుణ్యభూమిలో చూసాను.
@జ్యోతి గారికి.
మీకు రెండుసార్లు నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీరు నా తనువుకు మనసుకు అంటూ రెండుసార్లు శుభకామనలు తెలియజేసారు కాబట్టి.
@యడ్ల ఆదిలక్ష్మి గారికి
మిమ్మల్నందరినీ కంగారు పెట్టినందుకు మీరంతా నన్ను క్షమించాలి. మీ శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks