నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 6, 2009

చెలియకు విరహపు వేదన చేయని సింగారంబిది

నాదరామక్రియ
చెలియకు విరహపు వేదన చేయని సింగారంబిది
సొలవక వలపుల ముద్రల చొప్పులు మాపకుఁడీ. IIపల్లవిII

కిక్కిరిసిన చనుగుబ్బలు గీఁటిన పగిలెడి నయ్యో
పక్కనఁ గనుకలి దాఁకీ బయ్యెద దెరవకుఁడీ
వెక్కసమగు ముఖకాంతికి వెడవెడ మరుఁగై తోఁచెడి
చెక్కుల చెమటలు గందెడి చేతులు వెట్టకుఁడీ. IIచెలిII

అంగన మేనికిఁ బులకలు అడ్డము దోఁచెడి నయ్యో
బంగరు మొలకలవంటివి పై పైఁ దుడువకుఁడీ
తొంగలి రెప్పల కెలఁకుల తొరిగెడి కన్నుల మెరుఁగుల
ముంగిట వేసిన చూపుల మురిపెము మానుపుఁడీ(?) IIచెలిII

తిరువేంకటపతి నింతికిఁ దెచ్చెదమనఁగా నయ్యో
కరుణించిన వాఁడాతఁడె కళవళమందకుఁడీ
తరుణీమణి మా దేవునిఁ దగఁ గౌఁగిట సౌఖ్యంబుల
పరవశమందినదేమో పలుమరుఁ బిలువకుఁడీ. IIచెలిII 5-80

2 comments:

madhu said...

nada 'rama' kriya kaadu mastaaru ... nadanaamakriya ... audio pedithe vini santoshinche vallam ! manchi paata parichayam chesinanduku kritagnatalu.

Unknown said...

శ్రీగారూ
కామెంటినందుకు ముందుగా ధన్యవాదాలు. నాకు సంగీతంలో ఓనమాలు కూడా తెలియవు. కాని నాదగ్గరవున్న టి.టి.డి. వారి తాళ్ళపాక పద సాహిత్యము పుస్తకాలన్నింటిలోనూ నాదరామక్రియ అనే ఉన్నది. వారి కాలంలో అలా ఉండి తరువాతి కాలంలో ఏమైనా మార్పుచేర్పులు జరిగి పేరు మారి ఉండవచ్చేమో నాకు తెలియదు. సంగీతజ్ఞులైనవారు తేల్చాల్సిన విషయం యిది.
esnips లో ఎక్కడైనా దొరికితే ఆడియో జత చేస్తుంటాను.కాని ఈ పాటకి దొరకలేదు.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks