నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Mar 20, 2009

పొయ్యి క్రింది కొకటి, పొయ్యి మీఁది కొకటి-

ఆ.వె.
పొయ్యి క్రింది కొకటి, పొయ్యి మీఁది కొకటి-
అన్ని రాయితీలు ఆశ జూపి
మగువ వోట్ల తోడ మాయ మాటల తోడ
కోట్లు కూడఁబెట్ట కుర్చి నెక్కి.





నాకు వేయి
నీ ఓటు పాట

ప్రాజెక్టులెన్నొ కడితి - నాకు వేయి నీ ఓటు
రైతన్నకు మేలు చేస్తి - నాకు వేయి నీ ఓటు
ఇందిరమ్మఇల్లునిస్తి - నాకు వేయి నీ ఓటు
తెల్ల కార్డు నీకు ఇస్తి - నాకు వేయి నీ ఓటు
ఆరోగ్య శ్రీ పెట్టితి - నాకు వేయి నీ ఓటు
నేత వారి మగ్గాలకు రాయితీల నిచ్చితి - నాకు వేయి నీ ఓటు
రైతు రుణము మాఫి చేస్తి - నాకు వేయి నీ ఓటు
సాక్షి పేపరు పెట్టితి - నాకు వేయి నీ ఓటు
సాక్షి టీ.వి. పెట్టితి - నాకు వేయి నీ ఓటు
సారా పేకెట్టిచ్చితి - నాకు వేయి నీ ఓటు


యన్టిఆరు పార్టి - నాకు వేయి నీ ఓటు
రెండెకరాలిస్తా - నాకు వేయి నీ ఓటు
నెల నెల డబ్బులిస్త- నాకు వేయి నీ ఓటు
బేంకులో నీకేస్త- నాకు వేయి నీ ఓటు
అప్పులన్నీ మాఫి చేస్త - నాకు వేయి నీ ఓటు
అవినీతి అవినీతి - నాకు వేయి నీ ఓటు
రఘురాం సిమ్మెంట్సు - నాకు వేయి నీ ఓటు
బ్రాహ్మణి స్టీల్సయ్యొ - నాకు వేయి నీ ఓటు
వాడు కోట్లు మెక్కె - ఆ ఛాన్సు నాకియ్యి, నాకు వేయి నీ ఓటు
కూటమిని కూడిస్తి - నాకు వేయి నీ ఓటు
తెలంగాణ నేనిస్త - నాకు వేయి నీ ఓటు
ఇంద సార డబ్బు - నాకు వేయి నీ ఓటు

చిరంజీవి నేను - నాకు వేయి నీ ఓటు
వంట సరకు నీ కిచ్చెద- నా
కు వేయి నీ ఓటు
నేను నీతి మంతు - నాకు వేయి నీ ఓటు
సామాజిక న్యాయం తెస్త - నాకు వేయి నీ ఓటు
బి.సి. లకి సీట్లిచ్చితి- నాకు వేయి నీ ఓటు
ధరలన్ని తగ్గిస్త నే - నాకు వేయి నీ ఓటు
వాడు కోట్లు మెక్కె - నాకు వేయి నీ ఓటు
నాకొక్క ఛాన్సియ్యి - నాకు వేయి నీ ఓటు


అవినీతి అవినీతి - నాకు వేయి నీ ఓటు
అప్పుడాళ్ళతొ వుంటిని - నాకు వేయి నీ ఓటు
ఇప్పుడీళ్ళతొ వుంటిని - నాకు వేయి నీ ఓటు
థరుడు ఫ్రంటును తెస్త - నాకు వేయి నీ ఓటు
బాధ్యతలు నాకొద్దు - నాకు వేయి నీ ఓటు
పెత్తనము నే జేస్త - నాకు వేయి నీ ఓటు

కే.సి.ఆరు ను నేను - నాకు వేయి నీ ఓటు
తెలంగాణ నే తెస్త - నాకు వేయి నీ ఓటు
నెలలోనె నే తెస్త - నాకు వేయి నీ ఓటు
రాజీనామాల్నే జేస్త - నాకు వేయి నీ ఓటు
అందరికి బొంద బెడత - నాకు వేయి నీ ఓటు
మునుపు కాంగీ దోస్తు - నాకు వేయి నీ ఓటు
ఇపుడు కూటమి మస్తు - నాకు వేయి నీ ఓటు
ఇలా రాసుకుంటూ పోతే అలా సాగుతూనే ఉంటుందిది.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks