లలిత
నారాయణా నీనామమె గతి యిఁక
కోరికలు నాకుఁ గొనసాగుటకు. IIపల్లవిII
పైపై ముందట భవజలధి
దాపు వెనకఁ జింతాజలధి
చాపలము నడుమ సంసారజలధి
తేప యేది యివి తెగనీఁదుటకు. IIనారాII
పండె నెడమఁ బాపపురాశి
అండఁ గుడిని పుణ్యపురాశి
కొండను నడుమఁ ద్రిగుణరాశి - యివి
నిండఁ గుడుచుటకు నిలుకడ యేది. IIనారాII
కిందులోకములు కీడునరకములు
అందేటిస్వర్గా లవె మీఁద
చెంది యంతరాత్మ శ్రీవేంకటేశ నీ -
యందె పరమపద మవల మరేది. IIనారాII
౪-౩౮౮
ఉపాధి కల్పన
1 day ago












0 comments:
Post a Comment