మలహరి
వలెననువారిదె వైష్ణవము యిది
వలపుఁదేనెవో వైష్ణవము. IIపల్లవిII
కోరిక లుడుగుచు గుఱి నిన్నిటిపై
వైరాగ్యమెపో వైష్ణవము
సారెకుఁ గోపముఁ జలమునుఁ దనలో
వారించుటవో వైష్ణవము. IIవలెII
సుడిగొనుదేహపుసుఖదుఃఖములో
వడిఁ జొరనిదెపో వైష్ణవము
ముడివడి యింద్రియములకింకరుఁడై
వడఁ బడనిదెపో వైష్ణవము. IIవలెII
వుదుటునఁ దన సకలోపాయంబులు
వదలుటపో నిజవైష్ణవము
యెదుటను శ్రీవేంకటేశ్వరునామము
వదనము చేర్చుట వైష్ణవము. IIవలెII ౧-౪౦౫
యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలపలేదు?
1 hour ago
0 comments:
Post a Comment