నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Nov 30, 2008

తప్పని బొంకని యట్టి దామోదరా నాకు

భైరవి
తప్పని బొంకని యట్టి దామోదరా నాకు
దప్పిదేర మో వియ్యవో దామోదరా IIపల్లవిII

తరితీపుమాట లెల్ల దామోదరా నీకు
తరుణులు నేరిపిరా దామోదరా
దరిచేరె సంకు నీచే దామోదరా నీవు
తరగరివె తగు దామోదరా IIతప్పనిII

తగులు వీరి పందేల దామోదరా నీ
తగవు లేల చెప్పేవు దామోదరా
దగదొట్టి పలికేవు దామోదరా వెను
తగిలితి విందాఁక దామోదరా IIతప్పనిII

తల యెత్తు మా ముందర దామోదరా నీ
తళుకుమోవి చూచి దామోదరా
తలకొని కూడితివి దామోదరా యింక
తలఁగకు శ్రీవేంకటదామోదరా IIతప్పనిII ౧౫-౨౪౮

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks