కాంభోజి
ఆరగింపవో మాయప్ప యివే
పేరిన నేతులు పెరుగులును IIపల్లవిII
తేనెలు జున్నులు తెంకాయ పాలును
ఆనవాలు వెన్నట్లును
నూనె బూరెలును నురుగులు వడలును
పానకములు బహుఫలములును ।IIఆరII
పరమాన్నంబులు పంచదారలును
అరిసెలు గారెలు నవుగులును(?)
కరజికాయలును ఖండమండెగలు(?)
పరిపరివిధముల భక్ష్యములు। IIఆరII
కడుమధురంబగు కమ్మఁబూరణపుఁ
గుడుములు నిడ్డెన కుడుములును
సుడిగొను నప్పాలు సుకినప్పాలును
పొడి బెల్లముతోఁ బొరఁటుచును. । IIఆరII
కాయపు రుచులకు గనియగు మిరియపుఁ
గాయలు నేలకి కాయలును
పాయరాని యంబాళపుఁగాయలు(?)
నాయతమగు దధ్యన్నములు। IIఆరII
ఒడికవుఁ గూరలు నొలుపుఁ బప్పులును
అడియాలపు రాజాన్నములు
బడిబడిఁ గనకపుఁ బళ్ళెరములతోఁ
గడువేడుక వేంకటరమణా। IIఆరII ६-४
ఈ కీర్తనలో అన్నమయ్య ఎన్నో రకాలైన చవులూరించే పిండివంటలను నోరూరేలా వర్ణిస్తాడు। వీటిలో కొన్ని(?) నాకు తెలియనివి ఎవరైనా తెలియపరిస్తే సంతోషిస్తాను.
Jul 9, 2008
ఆరగింపవో మాయప్ప యివే
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment