నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 8, 2008

సరసుఁడవు నీవైతే చదురాలు నీ కాపె

శ్రీరాగం
సరసుఁడవు నీ వైతే చదురాలు నీ కాపె
అరు దాయ నన్నిటాను అమరు నిద్దరికే IIపల్లవిII

చెప్పఁగల వలపెల్లఁ జెలి నీతోఁ జెప్పి చెప్పి
చెప్పరానిమాటలకు సిగ్గు వడ్డది
చిప్పిలు నవ్వులఁ గొంత శిరసువంపులఁ గొంత
అప్పగించీఁ దెలుసుకో అవ్వలివిన్నపము. IIసరసుఁడII

సేయఁ గలవూడిగాలు సేసి సేసి నీ కాపె
సేయరాని చేఁతలకు సిగ్గు వడ్డది
చే యెత్తి మొక్కులఁ గొంత చిమ్మునిట్టూర్పులఁ గొంత
కాయము సోఁ కఁ గఁ జేసీ కడమ వూడిగెము IIసరసుఁడII

చెక్కు నొక్కు నొక్కి యిట్టె శ్రీవెంకటేశ్వర నిన్ను
చెక్కు చేతితోడనె తా సిగ్గు వడ్డది
పుక్కిటి విడేలఁ గొంత పొరచి చేఁతలఁ గొంత
గక్కన నీ కందియిచ్చీ కడమ దొడమలుIIసరసుఁడII -128

ఈ కీర్తన కూడా చాలా చాలా అందమైన కీర్తన।భార్యా భర్తల సరసపు చేష్టలలో కొన్ని చెప్ప గలిగినవీ కొన్ని చెప్పలేనివీ కూడా వుంటూ వుంటాయి।చెప్పగలిగినవాటిని చెప్పే విధాన్ని, చెప్పలేనివాటిని చేతలద్వారా సూచించే విధానాన్ని అన్నమయ్య ఈ సంకీర్తనలో బహు అందంగా కళ్ళకు కట్టిస్తాడు.
నీవు సరసుడవైతే నీకంటే చతురురాలామె। మీ మీ చేష్టలన్నీ అన్నిటా అరుదైనవి।ఇవి మీఇద్దరికే అమరేవి.
చెప్పగల వలపెల్లా చెలి నీతో చెప్పి చెప్పి చెప్పరాని మాటలకేమో సిగ్గుపడింది।కానీ వాటిని కూడా చిప్పిల్లే నవ్వులద్వారా కొంత శిరసు వంపులద్వారా కొంత నీకు ఆవలి విన్నపము నప్పగించినది తెలుసుకోవయ్యా।
నీ కాపె చేయగల వూడిగాలెల్లా చేసి చేసి చేయరాని చేతలకేమో సిగ్గు పడిందయ్యా। చేయెత్తి మొక్కే మొక్కులద్వారా కొంత, చిమ్మే నిట్టూర్పుల ద్వారా కొంత మిగిలిన వూడిగాన్ని నీ శరీరము సోకేలా చేసిందయ్యా।
ఓ శ్రీ వేంకటేశ్వరా నిన్ను చెక్కు నొక్కు నొక్కి పైగా తన చెక్కు చేతిలోనుంచుకొనే సిగ్గుపడ్డదయ్యా।నోటిలోని తాంబూలము ద్వారా కొంత, పొంచివున్న చేతలద్వారా కొంత మిగిలివున్న పనులన్నిటినీ గక్కున నీ కందిస్తున్నదయ్యా.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks