నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 2, 2008

చెప్పఁ గల బుద్దులెల్లాఁ జెప్పితి నీకు

శ్రీరాగం
చెప్పఁ గల బుద్దులెల్లాఁ జెప్పితి నీకు
నెప్పున నిట్లైతే మన్నించునే నీవిభుడు IIపల్లవిII
మంచిమాట లాడితేను మగఁ డు మోహించునే

వంచన గలిగితేను వసమైయుండునే
ముంచి శావలుసేసితే మొగమోట గలుగునే

మించి యీనేరుపుల మెలఁ గవే చెలియ IIచెప్పII

తన యిచ్చలో నుండితే దయతో రక్షించునే

మనసెఁ రిగి కూడితే మరిగుండునే
వినయమే సేసితే వేడుకతో లాలించునే
పెనఁ గక యీగుణాల బెరయవే చెలియ IIచెప్పII


నీవే పైకొంటేను నెమ్మది నిన్ను మెచ్చునే
యేవేళఁ బాయకుండితే యింపు వుట్టునే

శ్రీవేంకటేశుఁ డేలెఁ జిత్తము రా బ్రతుకవే

వేవేల కలమేల్మంగ వెలయవే చెలియ IIచెప్పII २२-310


ఈ కీర్తన కూడా చెలికత్తె అలమేల్మంగ తో అంటున్నదే
నీకు నేను చెప్పగలిగిన బుద్దులన్నీ చెప్పానుఈ విధమైన ఉపాయంతో అయితే విభుడు నిన్ను మన్నిస్తాడు
మంచి మాటలాడితే పెనిమిటి భార్యను మోహిస్తాడేవంచన కలిగుంటే భార్యకు వశమై వుంటాడుమునుకొని సేవలు చేస్తే మొగమోటపడివుంటాడుయిటువంటి నేర్పులతో అలమేల్మంగను మెలగమని చెలి హితవు చెపుతుందితన అభీష్టము మేరకు మెలగితే దయతో రక్షిస్తాడేతన మనసెరిగి కూడితే నీతోనే వుంటాడే
వినయంగా వుంటే వేడుకతో లాలిస్తాడేవివాదము లేకుండా యీ గుణాలతో మెలగమని అంటూంది చెలియ
నెమ్మదిని నీవే పైకొంటే నిన్ను మెచ్చుకుంటాడేఎప్పుడూ విడవకుంటే నువ్వంటే యిష్టం పుడుతుందే
శ్రీవేంకటేశ్వరుడు నిన్ను ఏలుకుంటాడు, ఆతని మనసుకు నచ్చేట్లుగా బ్రతుకవేఇలా ఎప్పటికీ ప్రకాశిస్తూ వుండమని చెలియ అలమేల్మంగనతో అంటూంది.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks