వర్ణన రత్నాకరము - హంశవింశతి - రాగ విశేషములు
సీ.
భైరవి మాళవి బంగాళ హిందోళ, రాజమంజరియు శ్రీరాగ గౌళ
భూపాళ లెన్మిది పురుషరాగంబులు, దేశాక్షి ఘూర్జరి దేశి తోడి
దేవక్రి యాందోళి దేవగాంధారియు, గౌళ గుండక్రియా హారి సలలి
త బిలహరి కురంజి ధన్యాశి పూర్ణగౌళ వరాళి నాట భల్లాతకి మల
గీ.
హరులు సారంగ రామక్రియలు ననంగఁ, గన్నడ యనంగ మంగళకౌశిక యన
వెలయు నారాయణియుఁ జతుర్వింశతి విధ,ములను దనరారు స్త్రీరాగములను మఱియు.
సీ.
కాంభోజి కేదారగౌళ శోకవరాళి, పున్నాగ గుమ్మకాంభోజి శంక
రాభరణము మేఘరంజి తోడివరాళి, నాదనామక్రియ నాట రీతి
గౌళ రామక్రియ మేళరామక్రియ, గౌళనారాయణగౌళ మధ్య
మావతియు ముఖారిమలహరి సామంత, పంతువరాళియు బాళిరాగ
గీ.
చెంచుమలహరి దేశాక్షి శ్రీవరాళి, మాళవియుఁ బాండిసింధురామక్రియయు వ
సంత సామంత శుద్ధవసంత గుబ్జ, రియును హేజిజ్జ్వినీలాంబరియు ననంగ
గీ.
పొసఁగ ముప్పది రెండు నపుంసకములు, మాళవశ్రీయనంగను మలహరి యన
దేవమలహరి రేగుప్తి దిరముకుంద, మలహ రన నైదు మిత్ర లీ మర్మ మరసి.
హంసవింశతి, అ 5, పద్య 123,124,125.
నాకు సంగీతం గుఱించి ఏ మాత్రం కూడా తెలియదు. అందుచేత నేను వ్రాయటంలో తప్పులు దొర్లి ఉంటాయి. ఎవరైనా తెలియపరిస్తే దిద్దుకుంటాను.
ఈ వర్ణన రత్నాకరం నుండి పద్యాలను నేను ఎందుకు ఎత్తి వ్రాస్తున్నాను? నా ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నలు నాలో మెదిలాయి. ఎందుకంటే --ఎందుకంటే--- నాకు తోచిన సమాధానం - - తెలుగు నేర్చుకోవటానికి, మఱియు పూర్వ గ్రంథాలలోని అపూర్వఆణిముత్యాలను ఏర్చి కూర్చి నలుగురితో పంచుకొని ఆనందించటానికి - - అనే సమాధానం నాకు తోచింది. సరే బావుంది, కాని ఈ పద్యాలు సరిగా అర్థంకావటం లేదు కదా -- అనే సందేహం -- ఎవరైనా పెద్దలు అర్థ వివరణ చేస్తారేమో అనే దురాశ ఒకటి. ఎవరైనా నీకు ఎందుకు అర్థవివరణ వ్రాసి సహాయపడాలి? మళ్ళీ ఓ ప్రశ్న. అవును నిజం. ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి కదా! మరైతే ఎలా? సమాధానం తోచింది. ఎవరికి వారే ఓ గురువుగా ఎందుకు మారకూడదు? ఎలా ?? మన కలన యంత్రాల్లో ఆంధ్రభారతి వంటి నిఘంటువుల సహాయంతో అర్థాలు తెలుసుకొనే ప్రయత్నం చేయొచ్చు కదా! అవును అదే సరియైన పద్ధతి. శ్రమ పడి అర్థ తాత్పర్యాలను సాధించగలిగితే కలిగే ఆ ఆనందమే వేఱు. దానికోసమైనా ప్రయత్నం చెయ్యాలి కదా అని అనిపించి మనస్సుకు స్వాస్థ్యత చిక్కింది.