గుండక్రియ
ఏ పురాణముల నెంత వెదకినా
శ్రీపతిదాసులు చెడరెన్నఁడును. IIపల్లవిII
హరివిరహితములు అవి గొన్నాళ్ళకు
విరసంబులు మరి విఫలములు
నరహరిఁ గొలి చిటు నమ్మినవరములు
నిరతము లెన్నఁడు నెలవులు చెడవు. IIఏపుII
కమలాక్షుని మతిఁగాననిచదువులు
కుమతంబులు బహుకుపథములు
జమళి నచ్యుతునిసమారాధనలు
విమలములే కాని వితథముగావు. IIఏపుII
శ్రీవల్లభుగతిఁ జేరనిపదవులు
దావతులు కపటధర్మములు
శ్రీవేంకటపతి సేవించుసేవలు
పావనము లధికభాగ్యపుసిరులు. IIఏపుII ౨-౮౮
దావతులు=?
Dec 7, 2008
ఏ పురాణముల నెంత వెదకినా
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment