దేవగాంధారి
అణు రేణు పరిపూర్ణమైనరూపము
అణిమాదిసిరి యంజనాద్రిమీఁదిరూపము. IIపల్లవిII
వేదాంతవేత్తలెల్లా వెదకెటి రూపము
ఆదినంత్యములేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరిరూపము. IIఅణుII
పాలజలనిధిలోనఁ బవళించేరూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగలరూపము
మేలిమి వైకుంఠాన మెరసినరూపము
కీలైన దిదే శేషగిరిమీఁదిరూపము. IIఅణుII
ముంచిన బ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచనిమఱ్ఱాకుమీఁది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలినరూపము
యెంచఁగ శ్రీవేంకటాద్రి నిదేరూపము. IIఅణుII ౨-౪౩౨
Dec 7, 2008
అణు రేణు పరిపూర్ణమైనరూపము
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment