దేవగాంధారి
అణు రేణు పరిపూర్ణమైనరూపము
అణిమాదిసిరి యంజనాద్రిమీఁదిరూపము. IIపల్లవిII
వేదాంతవేత్తలెల్లా వెదకెటి రూపము
ఆదినంత్యములేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరిరూపము. IIఅణుII
పాలజలనిధిలోనఁ బవళించేరూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగలరూపము
మేలిమి వైకుంఠాన మెరసినరూపము
కీలైన దిదే శేషగిరిమీఁదిరూపము. IIఅణుII
ముంచిన బ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచనిమఱ్ఱాకుమీఁది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలినరూపము
యెంచఁగ శ్రీవేంకటాద్రి నిదేరూపము. IIఅణుII ౨-౪౩౨
Showing posts with label హనుమంత కీర్తనలు. Show all posts
Showing posts with label హనుమంత కీర్తనలు. Show all posts
Dec 7, 2008
అణు రేణు పరిపూర్ణమైనరూపము
Posted by
Unknown
0
comments
Oct 28, 2008
శరణు శరణు వేదశాస్త్రనిపుణ నీకు
సాళంగనాట
శరణు శరణు వేదశాస్త్రనిపుణ నీకు
అరుదైన రామకార్యధురంధరా IIపల్లవిII
హనుమంతరాయ అంజనాతనయా
ఘనవాయుసుత దివ్యకామరూప
అనుపమలంకాదహన వార్ధిలంఘన
జనసురనుత కలశాపురనివాస. IIశరణుII
రవితనయసచివ రావణవనాపహార
పవనవేగబలాఢ్య భక్తసులభ
భువనపూర్ణదేహా బుద్ధివిశారద
జవసత్వవేగ కలశాపురనివాస. IIశరణుII
సీతాశోకనాశన సంజీవశైలాకర్షణ
ఆతతప్రతాపశౌర్య అసురాంతక
కౌతుకశ్రీవేంకటేశుకరుణాసమేత
శాతకుంభవర్ణ కలశాపురనివాస. IIశరణుII౨-౩౪౭
కలశాపుర హనుమద్వర్ణన చేసాడిందులో అన్నమయ్య.రవితనయసుతసచివ=సుగ్రీవునిమంత్రి,శాతకుంభము=బంగారు,ఆతత=విరివియైన,
Posted by
Unknown
0
comments
Oct 25, 2008
పెరిగినాఁడు చూడరో పెద్దహనుమంతుఁడు
|
సాళంగనాట
పెరిగినాఁడు చూడరో పెద్దహనుమంతుఁడు
పరగి నానావిద్యల బలవంతుఁడు. IIపల్లవిII
రక్కసులపాలికి రణరంగశూరుఁడు
వెక్కసపుయేకాంగవీరుఁడు
దిక్కులకు సంజీవిదెచ్చిన ధీరుఁడు
అక్కజమైనట్టి యాకారుఁడు. IIపెరిగిII
లలిమీరినయట్టిలావుల భీముఁడు
బలుకపికులసార్వభౌముఁడు
నెలకొన్న లంకానిర్ధూమధాముఁడు
తలంపున రామునాత్మారాముఁడు. IIపెరిగిII
దేవకార్యముల దిక్కు వరేణ్యుఁడు
భావింపఁగఁ దపఃఫలపుణ్యుఁడు
శ్రీవేంకటేశ్వరు సేవాగ్రగణ్యుఁడు
సావధానుఁడు సర్వశరణ్యుఁడు. IIపెరిగిII
Posted by
Unknown
0
comments
Subscribe to:
Posts (Atom)