పాడి
ఉల్లము గలయుదాఁకా వూరకుండుటే మేలు
మల్లాడి తా వలెనంటే మైకొనే నపుడు. IIపల్లవిII
మనసు నిర్మలమైతే మాట విన నింపౌను
ననుపు గలవారికి నవ్వ నింపౌను
చనవు గలిగితేను సాదించ నింపౌను
యెనయని చోటికి నేమిటికి మాటలు. IIఉల్లముII
తలయెత్తి చూచితేను దండకు రా నింపౌను
చెలిమి సేసితే విందు చెప్ప నింపౌను
పిలుపు గలిగితేను పెనఁగఁగ నింపౌను
వొలిసి నొల్లమికిని వొడి వట్ట నింపౌను. IIఉల్లముII
కరఁగి లోనైతేను కాఁగిలించ నింపౌను
సరస మాడితే చెయి చాఁచ నింపౌను
యిరవై శ్రీవేంకటేశుఁ డితఁ డిట్టె నన్నుఁ గూడె
తరితీపై నందుకు తామసించ నేటికే. IIఉల్లముII ౧౬-౮
Dec 5, 2008
ఉల్లము గలయుదాఁకా వూరకుండుటే మేలు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment