నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Dec 2, 2008

గోవిందాశ్రిత గోకులబృందా

లలిత
గోవిందాశ్రిత గోకులబృందా
పావన జయ జయ పరమానందా. IIపల్లవిII

జగదభిరామా సహస్రనామా
సుగుణధామ సంస్తుతనామా
గగనశ్యామా ఘనరిపుభీమా
అగణితరఘువంశాంబుధి సోమా. IIగోవిందాII

జననుతచరణా శరణ్యశరణా
దనుజహరణ లలితస్ఫురణా
అనఘాచర ణాయత భూ భరణా
దినకరసన్నిభ దివ్యాభరణా. IIగోవిందాII

గరుడతురంగా కారోత్తుంగా
శరధిభంగ ఫణిశయనంగా
కరుణాపాంగా కమలాసంగా
వర శ్రీవేంకటగిరిపతిరంగా. IIగోవిందాII౧౫-౨౬౦

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks