సామంతం
ఇట్లానే యోగలక్ష్య మెఱుఁగుకొంటే ఫలించు
యెట్లయినా గురువాక్య మేమరకుఁడీ IIపల్లవిII
కాంతఁ దలచుకొంటేనే కామోద్రేకము వుట్టు
యింతలోఁ గూడెనా యేడకేడ సూత్రము
చింతకాయతొక్కు చూచితేనే నోరూరు
యెంతకెంతదవ్వుయేడకేడ సూత్రము. IIఇట్లాII
వీనుల మంచిమాటలు నింటేనే సంతోష ముబ్బు
యేనిజము గనె నేడకేడ సూత్రము
ఆనించితే నాలుకనే ఆరురుచులుఁ దెలిసీ
యీనెపమున నేడకేడ సూత్రము. IIఇట్లాII
ముక్కుకొనఁ బ్రాణ ముండి ముందువెనుకకు వచ్చి
యెక్కడ మోచున్న దేడ కేడ సూత్రము
చిక్కి శ్రీవేంకటేశుఁడు జీవుల కంతర్యామి
యిక్కు వెఱిఁగితే నీడ కిదే సూత్రము. IIఇట్లాII ౨-౨౩౪
Oct 28, 2008
ఇట్లానే యోగలక్ష్య మెఱుఁగుకొంటే ఫలించు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment