|
శంకరాభరణం
దేవుఁడుగలవారికి దిగులుఁ జింతయు లేదు
శ్రీవిభుఁడే అన్నిటా రక్షించుఁగనక IIపల్లవిII
యేలికగల బంటుకు యేవిచారములేదు
వోలి మగఁడుగలాలికి వొప్పమి లేదు
పోళిమిఁ దండ్రిగలపుత్రుని కంగద లేదు
మేలుగాఁ బండినభూమికిఁ గరవు లేదు. IIదేవుఁడుII
బలముగలరాజుకు భయమేమియు లేదు
కలిమిగలవాని కక్కర లేదు
యిల నాచారవంతుని కేపాపమును లేదు
తలఁపుఁ బుణ్యముగల ఆతనికిఁ జేటు లేదు. IIదేవుఁడుII
గురువుగలవానికిఁ గొఱఁత యేమియు లేదు
పరముగలవానికి భ్రాంతులు లేవు
యిరవై శ్రవేంకటేశుఁ డిన్నిటా మాకుఁ గలఁడు
అరయ దాసులము మా కడ్డాఁకే లేదు. IIదేవుఁడుII ౨-౨౫౪
అంగద= ఆకలి,దుఃఖము
అడ్డాకు=?
2 comments:
మీరు నన్నొక సలహా అడిగారు.నాకు ఆ అర్హత ఉందంటారా ! అయినా ప్రయత్నిస్తా. నాకు తోచినవి 1.శ్లోక మంజరి 2. శ్లోకదీపిక 3.శ్లోకవాజ్ఞ్మయం.
i named it sooktimuktaavali. please visit the new blog here and let me know your valued opinion on that.
http://sooktimuktaavali.blogspot.com
thanking you in advance--narasimha rao mallina
Post a Comment