సామంతం
ఎదురు మాటలాడితి నీకు యీ తప్పును లోఁ గొను నీవు
పదరఁగఁదగదు నీకు పంతము లిచ్చితిఁ గావఁగదే. IIపల్లవిII
మునుపే నే విన్నవించితిని విన నవధరించితివి నీవు
వెనక వేసుకో శరణు చొచ్చితిని విడువకు నన్ననుచు
ననుఁజూచి 'దేహి' యంటే 'నాస్తి' యనరాదు నీకు
ఘనయాచకుఁడను నేను కడుదాతవు నీవు. IIఎదురుII
వెదకి నిను వేఁడుకొంటిని విచ్చేసితివి మా యింటికి
వదలఁదగదు నీ భక్తి యొసఁగు నీ వాఁడను పాయకుమనుచు
పదిలంబుగ మొక్కిన చేతులు బలిమిఁ గోయరాదు
యిదివో బంటను నేను యేలినవాఁడవు నీవు. IIఎదురుII
మరిగి నీ ముద్రలు మోచితిని మన్నించితి విటు నను నీవు
కరుణతోడ నా యపరాధంబులు కడపు కావుమనుచు
యిరవై నీ పేరు వెట్టితే నియ్యకొనక పోరాదు
నరమాత్రుఁడ నే శ్రీవేంకటేశ నాయకుఁడవు నీవు। IIఎదురుII ౨-౨౯౯
Oct 8, 2008
ఎదురు మాటలాడితి నీకు యీ తప్పును లోఁ గొను నీవు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
విజయదశమి శుభాకాంకాంక్షలు.ఆ లోకమాత మీకు ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు,మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ....
Post a Comment