శుద్ధవసంతం
దీనరక్షకుఁ డఖిలవినుతుఁడు దేవదేవుఁడు రాముఁడు
జానకీపతిఁ గొలువుఁడీ ఘనసమరవిజయుఁడు రాముఁడు IIపల్లవిII
హరుని తారకబ్రహ్మమంత్రమై యమరిన యర్థము రాముఁడు
సురలఁ గాచి యసురల నడఁచిన సూర్యకులజుడు రాముఁడు
సరయువందును ముక్తి చూరలు జనుల కొసఁగెను రాముఁడు
హరియె యీతఁడు హరివిరించుల కాదిపురుషుడు రాముఁడు। IIదీనII
మునులరుషులకు నభయమొసఁగిన మూలమూరితి రాముఁడు
మనసులోపలఁ బరమయోగులు మరగు తేజము రాముఁడు
పనిచి మీఁదటి బ్రహ్మపట్టము బంటు కొసఁగెను రాముఁడు
మనుజ వేషము తోడ నగజకు మంత్రమాయను రాముఁడు। । IIదీనII ౨-౧౭౮
బలిమి మించిన దైవికముతో భక్తసులభుఁడు రాముఁడు
నిలిచి తన సరిలేని వేలుపు నిగమ వంద్యుడు రాముఁడు
మెలుపు శ్రీవేంకటగిరీంద్రము మీఁది దేవుఁడు రాముఁడు।
వెలసె వావిలిపాటి లోపలి వీరవిజయుఁడు రాముఁడు। IIదీనII ౨-౧౭౮
Oct 9, 2008
దీనరక్షకుఁ డఖిలవినుతుఁడు దేవదేవుఁడు రాముఁడు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment