ఉ॥
శ్రీ నటలోదువలన్మదు ఝురీల సమాన తరంగ సంగి భృం
గీ నినదంబుకంటె; పిక కీర శిఖానల రాజి రాజిత
స్వానము కంటె; సంతతలసన్మహతీ బృహతీ కళావతీ
మానిత కచ్ఛపీక్వణన మాధురి కంటెను; నప్రతీక సం
ధ్యాసలునైక కేలికల నా కుహనావటుకోత్తమాంగ సం
ధానిత సాగరేంద్ర బలనా వలమాన తరంగ ఘంఘమా
సూన రవంబు కంటెను; మనోహర గాంగ తరంగ డోలికా
పీన మృణాళనాళ సరసీజదళౌదనమోది హంస ని
స్వానము కంటె; సౌరభ విభాసిత కల్ప మహీరుహోజ్వలల్
సూన సువృష్టి కంటె; పరిశుభ్ర మహీధర శృంగ నిర్గతా
హీన నవీన సీకర సమేడ్య పతజ్జలపాత జల్జల
ధ్వానము కంటె; బర్హిణ కదంబ మనః ప్రమదానుకల వ
ర్షాన వవారిద ప్రకట శబ్దము కంటెను; దాన పద్విష
న్మానవతీల సన్నటన మంజుల శింజిత తాల మానస
ద్గానము కంటె; నిష్ట వనితా కుచ కుంభ యుగోపగుహ నా
ధీన నితాంకర్షణ విధి ప్రకటీకృత తార హార సం
తాన సముద్భవత్కల నినాదము కంటె; కపోత పోత కం
ఠానయ నిక్వణాఢ్య నలినాయత దృజ్ఞ్మతంబు కంటె; శ్రీ
జానితనూభవ ప్రథన సంగత ఘర్మజలాపనీద వే
లాను తలీజనాయిత విలాసవతీ వసనాగ్ర చేల నా
న్యూన కరాంబుజద్వయ మనోహర కంకణ కింకిణీక ని
క్వాణము కంటె; భద్రగజ భాసుర బృంహిత పారశీక హే
షా నికరంబు కంటె; సరుసంబయి కోవిద కర్ణపేయమై
జాను తెనుంగు కైత నెల జవ్వని నొద్దిక దిద్ది చూపెదన్.
Oct 14, 2008
జాను తెనుంగు కైత - శ్రీ పులుగుర్త వేంకట రామ రాయ కవి
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment