నాదరామ క్రియ
చిత్తగించు మామాఁట శ్రీ నరసింహా
చిత్తజ జనక వో శ్రీ నరసింహా. IIపల్లవిII
చెలరేఁగి వున్నాఁ డవు శ్రీ నరసింహా -నీకు
జెలులెల్లా మొక్కేరు శ్రీ నరసింహా
సెలవుల నవ్వేవిట్టే శ్రీ నరసింహా - నీకే
నెలవు మా వలపులు శ్రీ నరసింహా. IIచిత్తII
చిందీని మైఁ జెమటలు శ్రీ నరసింహా - నిన్ను
జెందినది కడు జాణ శ్రీ నరసింహా
చెందమ్మి రేకులగోళ్ళ శ్రీ నరసింహా - నీపై
చిందులెల్లాఁ బాడేము శ్రీ నరసింహా . IIచిత్తII
సిరి నెరకాఁ గిటి శ్రీ నరసింహా - మంచి
సిరుల నహోబలము శ్రీ నరసింహా
శిరసెత్తు శ్రీ వేంకట శ్రీ నరసింహా
చెరలాటాలిఁకనేల శ్రీ నరసింహా. IIచిత్తII ౭-౪౯౫
Oct 13, 2008
చిత్తగించు మామాఁట శ్రీ నరసింహా
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
very nice song. నాకు చాలా ఇష్టం ఈ పాట. thanks
ఈ పాటని esnips.com నుండి ఇదే విండో లో ఉండి play అయ్యేలా చెయ్యటం ఎలానో దయతో చెప్పరూ..
Post a Comment