|
పాడి
రాముఁడు రాఘవుఁడు రవికులుఁ డితడు
భూమిజకుఁ బతియైన పురుషనిధానము IIపల్లవిII
అరయఁ బుత్రకామేష్టియందుఁ బరమాన్నమున
పరగఁ జనించిన పరబ్రహ్మము
సురల రక్షింపఁగ నసురల శిక్షింపఁగ
తిరమై యుదయించినదివ్యతేజము. IIరాముడుII
చింతించే యోగీశ్వరుల చిత్తసరోజములలో
సంతతము నిలిచిన సాకారము
వంతలహగా మునులెల్ల వెదకి కనేయట్టి-
కాతులఁ జెన్నుమీరినకైవల్యపదము. IIరాముడుII
వేదవేదాంతములందు విజ్ఞానశాస్త్రములందు
పాదుకొనఁ బలికేటి పరమార్థము
పోదితో శ్రీవేంకటాద్రిఁ బొంచి విజనగరాన
ఆదికి సనాదియైన అర్చావతారము. IIరాముడుII ౪-౧౬౯
0 comments:
Post a Comment