|
లలిత
అన్ని మంత్రములు నిందే ఆవహించెను
వెన్నతో నాకుఁ గలిగె వేంకటేశుమంత్రము IIపల్లవిII
నారదుండు జపియించె నారాయణమంత్రము
చేరెఁ బ్రహ్లాదుఁడు నారసింహమంత్రము
కోరి విభీషణుఁడు చేకొనె రామమంత్రము
వేరె నాకుఁగలిగె వేంకటేశుమంత్రము IIఅన్నిII
రంగగు వాసుదేవమంత్రము ధ్రువుఁడు జపించె
నంగవించెఁ గృష్ణమంత్ర మర్జునుఁడును
ముంగిట విష్ణుమంత్రము మొగి శుకుఁడు పఠించె
వింగడమై నాకునబ్బె వేంకటేశుమంత్రము IIఅన్నిII
యిన్ని మంత్రములకెల్ల యిందిరానాథుఁడే గురి
పన్నినదిదియే పరబ్రహ్మమంత్రము
నన్నుఁగావఁ కలిగెఁబో నాకు గురుఁడియ్యఁగాను
వెన్నెలవంటిది శ్రీవేంకటేశు మంత్రము. IIఅన్నిII ౪-౪౩౮
7 comments:
This is the first keertan I ever learnt. I love this song. Veankatadri vennela.. nijamgaane.
Sir,
my problem is, I cant classify the songs into Sringara, Athyatmik .. etc unless I am very sure of it. Will u please notify me, If I posted a song without a label ? Thanks.
పాట అమృతవర్షిణి రాగంలో సుప్రసిద్ధం. ఈ మధ్యనే చదివాను వింగడము అంటే చెరకు గడ అని. నెనరులు.
సుజాత గారూ
మీరు నేను ఒకరికొకరు team member గా add చేసుకుంటే మీరు post చేసిన సంకీర్తనకు అధ్యాత్మిక,లేక శృంగార సంకీర్తన అనే విభజనను తేలిగ్గా చేసుకోవచ్చనుకుంటున్నాను.అందుకని నా బ్లాగులో మీ బ్లాగు పేరును add చేస్తున్నాను. మీకంగీకారమయితే మీరూ అలానే చేయండి.మీకు కీర్తనల labeling విషయంలో నా సంపూర్ణ సహకారం ఎప్పుడూ ఉంటుంది.
Sir,
I dint understand your proposal precisely, however, thanks for the offer. I have no problem to join you as a team member but, since I am not a regular blogger, I may not be of much help.
But if you join my team, I will have a blast, I am sure. Moreover, Your blog is my favourite. So I will be honoured to be a part of ur team.
సుజాత,
నరసింహంగారు అన్నది. ఒకరిబ్లాగులొ ఒకరు ఆథర్స్ గా చే్రొచ్చు అని. కాని అలా చేరితే ఒకరిబ్లాగులో ఇంకొకరు పోస్టులు రాయొచ్చు. కాని తమ పోస్టులు తప్ప ఇతరుల పోస్టులు ఎడిట్ లేదా మార్పులు చేయలేరు. ఎవరి పోస్టులు వారే మార్చుకోవచ్చు. టైటిల్స్ ఐనా, లేబిల్స్ ఐనా. ఏదైనా. లేదా అలా కాకుండా ఇద్దరూ ఒకే బ్లాగును మెయింటేన్ చేయాలంటే ఇద్దరూ ఒకే యూజర్ ఐడీ, పాస్‍వర్డ్ తో లాగిన్ అవ్వాలి. means anyone can login and write, edit the posts with the original id password, if u join as co author with your own mail. u can only change ur posts in tht blog..
it has been a great experience listening the song and seeing the lyrics simultaneously.
thanks a lot sir for providing such a great experience.
bollojubaba
Post a Comment