|
భైరవి
ఉగ్గు వెట్టరే వోయమ్మా చె-
య్యొగ్గీనిదె శిశువోయమ్మా। IIపల్లవిII
కడుపులోని లోకమ్ములు గదలీ-
నొడలూఁచకురే వోయమ్మా
తొడికెడు సరుగనఁ దొలఁగఁదీయరే
వుడికెడి పాలివి వోయమ్మా IIఉగ్గుII
చప్పలు వట్టుక సన్నపు బాలుని-
నుప్పరమెత్తకురో యమ్మా
అప్పుడె సకలము నదిమీ నోరనె
వొప్పదు తియ్యరె వోయమ్మా IIఉగ్గుII
తొయ్యలులిటు చేతుల నలఁగించక
వుయ్యల నిడరే వోయమ్మా
కొయ్యమాటలను కొండల తిమ్మని-
నొయ్యన తిట్టకురోరమ్మా. IIఉగ్గుII
1 comments:
మా తాత కంటే మీరు చాలా పెద్ద వారే........... అయితే మిమ్ములిని తాత అంటున్నాను. " many more happy returns of the day." మీరు రాసిన వుగ్గు పట్టరే చాలా బాగున్నాయి. అన్నమయ్య పాటలు కూడా బాగున్నయి. Thank you. Bye.....bye....
Sree Vaishnavi.
Post a Comment