నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 14, 2008

తెలియ దెవ్వరికిని దేవదేవేశ యీ

శ్రీరాగం
తెలియ దెవ్వరికిని దేవదేవేశ యీ
నెలఁ త భావంబెల్ల నీవెఱుఁగు దిఁకనూ IIపల్లవిII

నిలుచుఁ దలయూఁచుఁ గన్నీరు వాలిక గోళ్ళఁ
జినుకు నివ్వెఱఁగుపడుఁ జింతించును
పులకించు నలయుఁ దలపోయు నినుఁ జిత్తమున
నిలువునంగన విధము నీ వెఱుఁగు దిఁకను IIతెలియII

కమలంబు చెక్కుతోఁ గదియించు నెన్నుదుట
చెమటఁ బయ్యెదఁ దుడుచు సెలవి నగును
తమకంపుఁ గోరికలు తరుణి యిదె నినుఁబాసి
నిమిష మోర్వఁగలేదు నీ వెఱుఁగు దిఁకను IIతెలియII

వెక్కసపు నునుదురుము వెడవదల నేరదు
చిక్కుదేరఁగఁ గొంత సిగ్గు వడును
ఇక్కవలఁ దిరువేంకటేశ నినుఁ గూడె నిదె
నిక్కమీ చెలి వగల నీ వెఱుఁగు దిఁకనూIIతెలియII ౬-౭౨.

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks