నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 19, 2014

ఘనుడాతడా యితడు కలశాపురము కాడ

ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
హనుమంతుడితడా అంజనాతనయుడు

పెడచేత లోచేత బెరసి కొందరిఁ గొట్టె

అడరి దానవుల హనుమంతుడు
బెడిదంపుఁ బెనుతోక బిరబిరఁ దిప్పి మొత్తె
అడగ మాల్యవంతు హనుమంతుడు

దాకాల మోకాల దాటించె కొందరి

ఆకాశవీధి నుండి హనుమంతుడు
పైకొని భుజములఁ బడఁదాకెఁ గొందరి
ఆకడ జలధిలోన హనుమంతుడు

అరుపుల నూరుపుల అందరిఁ బారగఁదోలె

ఔరా సంజీవికొండ హనుమంతుడు
మేరతో శ్రీవేంకటాద్రిమీది దేవుని బంటు
ఆరితేరిన బిరుదు హనుమంతుడు           ద్విరదగతి రగడ
ఘనుడాతడా యితడు కలశాపురముకాడ
హనుమంతుడితండా అంజనాతనయుండు
పెడచేత లోచేత బెరసి కొందరిఁ గొట్టె
అడరి దానవుల గొట్టెహనుమంతుడితండు
బెడిదఁపుఁ బెనుతోక బిరబిర దిప్పి మొత్తెను
అడగ మాల్యవంతు హనూమంతు డీతండు
దాకాల మోకాల దాటించె కొందరిని
ఆకాశవీధి నుండి హనుమంతుడితండు
పైకొనిన భుజములతొ బడఁదాకి కొందరిన్
ఆకడ జలధిలోన హనుమంతుడీతండు
అరుపులతొనూరుపుల అందరిఁ ని పోదోలె
ఔర సంజీవికొండ హనుమంతుడితండు
మేరతో శ్రీవేంకటాద్రి దేవుని బంటు
ఆరితేరిన బిరుదు హనుమంతుడీతండు
గణ విభజన
సలభలసలసల
| | U |U | | || | U || | U |
ఘ ను డా తడా యి త డుక ల శా పుర ము కా డ
సలయరసల
| | U || U UU | U| | U |
హ ను మం తుడి తం డాఅం జ నాత న యుం డు
సలతనగసల
| | U |U U || | | U| | U |
పె డ చే తలో చే తబె ర సి కొంద రిఁ గొ ట్టె
నగనగనగసల
| | | U| | | U| | | U| | U |
అ డ రి దాన వు ల గొట్టె హ ను మంతు డి తం డు
నలల?నగ?
| | | | || U | || | | U| U | |
బె డి దఁ పుఁ బెను తో క బిర బి ర దిప్పి మొ త్తె ను
నగ?తత
| | | U| U | |U U |U U |
అ డ గ మాల్య వం తు హనూ మం తుడీ తం డు
తతతభల
U U |U U |U U |U | | |
దా కా లమో కా లదా టిం చెకొం ద రి ని
తరనగసల
U U |U | U| | | U| | U |
ఆ కా శవీ ధి నుండి హ ను మంతు డి తం డు
భలనలలసలర
U | | || | | | || | U |U | U
పై కొ ని నభు జ ము ల తొబ డఁ దా కికొం ద రిన్
భలసలసలత
U | | || | U || | U |U U |
ఆ క డ జల ధి లో నహ ను మం తుడీ తం డు
నలలభలభలత
| | | | |U | | |U | | |U U |
అ రు పు ల తొనూ రు పు లఅం ద రిఁ నిపో దో లె
రరనగసల
U | UU | U| | | U| | U |
ఔ ర సంజీ వి కొండ హ ను మంతు డి తం డు
రతరసల
U | UU U |U | U| | U |
మే ర తోశ్రీ వేం కటా ద్రి దేవు ని బం టు
రనలలసలత
U | U| | | | || | U |U U |
ఆ రి తేరి న బి రు దుహ ను మం తుడీ తం డు

1 comments:

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ said...

ఇది అత్యంత విలువైన బ్లాగు తెలుగు సాహితీ ప్రియులకు నిర్వహిస్తున్న నరసింహము గారికి అభినందనలు.

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks