నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jun 30, 2010

తుది నున్న ఙ ఞ ణ న మ లు వదలిన యా క చ ట త ప ల వర్గాక్షరముల్

వర్గవళి నిరూపణము

క.
తుది నున్న ఙ ఞ ణ న మ లు
వదలిన యా క చ ట త ప ల వర్గాక్షరముల్
వొదిఁ దనవంగడములలో
నదికిన నవ్వళులు వర్గజాఖ్యము లరయన్
. 36

వర్గాక్షరాలలో ప్రతి వర్గానికీ చివరను గల అనునాసికాక్షరములను విడిచి పెట్టి మిగిలిన వర్గాక్షరాలు తమ తమ వర్గంలోని ఇతర అక్షరాలతో అతికినప్పుడు ఆ యతులను వర్గజ యతులు అంటారు. అంటే క, ఖ ,గ, ఘ లు ; చ, ఛ, జ ఝ లు ; ట, ఠ, డ, ఢ లు ; ప. ఫ, బ, భ, లు -- ఇవి ఏ వర్గంలోని అక్షరాలు ఆ వర్గంలోని ఇతర అక్షరాలతో యతి సాజాత్యాన్ని కలిగి ఉంటాయి.

సీ.
కమనీయరాజశిఖామణి కరిరాజగర్వమహీధ్రనిర్ఘాతమునకు
చతుర యశస్సిత చ్ఛత్త్రి కాయోధన జయదాశ్వభంజళీ ఝుంపునకును
టంకితరాయకఠారిసాళువునకు డంభలాంఛన కోల  ఢాలునకును
తత్త్వ పురాణకథా రసవేదికి దాన దయా ధర్మ ధామ మతికి
తే.
పశుపతిప్రాప్త సామ్రాజ్యఫలున కబ్జ I బంధుబంధురతేజోవిభావసునకును
విశ్వవిభునకు సరి లేరు విశ్వజగతి I ననిన నివి వర్గవళ్లకు నచ్చు గృతుల. 37

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks