నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Nov 30, 2008

వేగిరించ కంతేసి త్రివిక్రము

ముఖారి
వేగిరించ కంతేసి త్రివిక్రము
సేగుఁ జుక్క రానీ త్రివిక్రమ IIపల్లవిII

వేసరించఁ జుమ్మీ త్రివిక్రమ నిన్ను
వీసమంత పనికే త్రివిక్రమ
వేసేవు పూవులను త్రివిక్రమా మేని
వేసురుఁ జెమటల త్రివిక్రమ IIవేగిII

వెన్నెలలో నవ్వకు త్రివిక్రమా కన్న
విన్న వారేమందురో త్రివిక్రమా
విన్నాణపు చేఁతల త్రివిక్రమా
వెన్నగారీ నీ మోవి త్రివిక్రమాIIవేగిII

వెడజారెఁ దురుము త్రివిక్రమా నన్ను
విడిదిలోఁ గూడితి త్రివిక్రమా
విడువ శ్రీవేంకటత్రివిక్రమా నీ
విడిముడి మెట్టితి త్రివిక్రమా IIవేగిII ౧౫-౨౪౩

0 comments:

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks