|
మాళవిగౌళ
వెదకెద నిను నే వేదము చెప్పఁగ
హృదయములోననే యిరవు నీ కటా। IIపల్లవిII
శ్రీనాథా పిలిచితిఁ బలుకఁగదే
పూని యన్నిటా నుందువటా
మానితముగ నామాట వినఁగదే
వీనుల సర్వము విందువటా। IIవెదకెదII
పరమాత్మా తప్పక పొడచూపవే
తరుణవయసు మరుతండ్రివటా
పరగ మొక్కెదను పాదము చాఁచవే
సిరుల బ్రహ్మ పూజించినదే యటా। IIవెదకెదII
గోవిందా నీ గుఱు తెఱిఁగించవే
వేవేలు మహిమల విభుఁడవటా
శ్రీ వేంకటేశా జిగి నలమేల్మంగ
కైవశమై మముఁ గాతువటా। IIవెదకెదII ౧౫-౩౪౩
1 comments:
pata chaalaa baga alapinchaaru
Post a Comment