శ్రీరాగం
ఏమి చెప్పే దిది యీశ్వరమాయలు
దీముప్రతిమకును త్రిజగముఁ గలిగె IIపల్లవిII
మలమూత్రంబులమాంసపుముద్దకు
కులగోత్రంబులగుఱి గలిగె
తొలులు తొమ్మిదగు తోలుఁదిత్తికిని
పిలువఁగఁ బేరునుఁ బెంపునుఁ గలిగె. IIఏమిII
నెత్తురునెమ్ములనీరుబుగ్గకును
హత్తిన కర్మము లటు గలిగె
కొత్తవెంట్రుకలగుబురులగంతికి
పొత్తులసంసారభోగము గలిగె. IIఏమిII
నానాముఖములనరములపిడుచకు
పూనినసిగ్గులు భువిఁ గలిగె
ఆనుక శ్రీవేంకటాధిపుఁ డేలఁగ
దీనికిఁ బ్రాణము తిరముగఁ గలిగె. IIఏమిII
Oct 27, 2008
ఏమి చెప్పే దిది యీశ్వరమాయలు
Posted by
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment