|
భైరవి
హరి నామము కడు నానందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా. IIపల్లవిII
నలినాక్షునిశ్రీ నామము
కలిదోషహరము కైవల్యము
ఫలసారము బహుబంధమోచనము
తలఁచవో తలఁచవో తలఁచవో మనసా. IIహరిII
నగధరునామము నరకహరణము
జగదేకహితము సమ్మతము
సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవో పొగడవో పొగడవో మనసా. IIహరిII
కడఁగి శ్రీవేంకటపతి నామము
బడిబడినే సంవత్కరము
అడియాలంబిల నతిసుఖమూలము
తడవవో తడవవో తడవవో మనసా. IIహరిII ౪-౪౦౯
3 comments:
Now your blog is superb. Sir, I m very happy for this song here. thanks.
మీ బ్లాగ్ కొస్తే - తిరుమల కు వచ్చిన అనుభూతి కలుగుతూందండీ. చాల బావుంది. నా బ్లాగ్ టెంప్లెట్ కూడా జ్యోతి గారే చేసారు. నా దగ్గర మీ అంత కలెక్షన్ లేదు. మీ బ్లాగ్ చాలా చాలా బావుంది. మంచి సేవ చేస్తున్నారు.
సుజాత గారూ
అంతా ఆ శ్రీనివాసుని దయ.జ్యోతి గారి మనస్సులో ప్రవేశించి ఆయన బ్లాగును అలా తయారు చేయించు కున్నాడనుకుంటున్నాను.మీరన్న విషయమే గుర్తుకొస్తోంది. నాహం కర్తాః హరిః కర్తాః.
Post a Comment